మీరు చదివేలోపే వాట్సాప్ మెసేజ్‌ను డిలీట్ చేశారా.? ఏ యాప్ లేకుండానే మెసేజ్ చూసే ట్రిక్

Published : May 15, 2026, 02:55 PM IST

WhatsApp: వాట్సాప్‌లో మెసేజ్ పంపి వెంటనే “Delete for Everyone” చేస్తుంటారు. అప్పుడు ఆ మెసేజ్‌లో ఏముందో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సాధారణంగా దీనికోసం థర్డ్ పార్టీ యాప్స్ వాడుతుంటారు. కానీ ఆ అవ‌స‌రం లేకుండా వేరే మార్గం కూడా ఉందని తెలుసా 

PREV
15
ఈ ట్రిక్ పనిచేయాలంటే..

ఈ పద్ధతి పని చేయాలంటే మీ వాట్సాప్‌లో చాట్ బ్యాక‌ప్ ఫీచర్ ముందుగానే ఆన్‌లో ఉండాలి. అలాగే మెసేజ్ డిలీట్ అయ్యే ముందు బ్యాకప్ తీసి ఉండాలి. అంటే ఆ మెసేజ్ బ్యాకప్‌లో సేవ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి రికవర్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి 8 గంటలకు ఎవరో మెసేజ్ పంపారు అనుకోండి. 8:15కి వాట్సాప్‌ ఆటోమేటిక్‌గా బ్యాకప్ తీసుకుంది. తర్వాత 8:30కి ఆ వ్యక్తి మెసేజ్ డిలీట్ చేశాడు. ఇప్పుడు మీరు పాత బ్యాకప్‌ను రీస్టోర్ చేస్తే ఆ మెసేజ్ మళ్లీ కనిపిస్తుంది.

25
ముందుగా బ్యాకప్ టైమ్ చెక్ చేయాలి

మొదట మీ వాట్సాప్‌లో చివరిసారి ఎప్పుడు బ్యాకప్ తీసుకుందో తెలుసుకోవాలి.

* ఐఫోన్ యూజ‌ర్లు అయితే వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంత‌రం చాట్స్‌లోకి వెళ్లి చాట్ బ్యాక‌ప్ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకోవాలి. అక్కడ చివరి బ్యాకప్ తేదీ, సమయం కనిపిస్తుంది.

* ఇక ఆండ్రాయిడ్ యూజ‌ర్ల విషయానికొస్తే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్‌లోకి వెళ్లాలి. అనంత‌రం చాట్స్ ఓపెన్ చేసి చాట్ బ్యాక‌ప్‌లోకి వెళ్లి వివ‌రాలు చూడొచ్చు.

ఒక‌వేళ డిలీట్ అయిన మెసేజ్ బ్యాకప్ టైమ్‌కు ముందు వ‌స్తేనే దాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

35
వాట్సాప్ అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి

బ్యాకప్ వివరాలు చూసిన తర్వాత వాట్సాప్‌ యాప్‌ను ఫోన్ నుంచి తొలగించాలి. తర్వాత యాప్ స్టోర్‌ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మళ్లీ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యాక మీ మొబైల్ నంబర్‌ను వెరిఫై చేస్తే వాట్సాప్‌ ఆటోమేటిక్‌గా పాత బ్యాకప్‌ను గుర్తిస్తుంది. అప్పుడు “Restore” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పాత చాట్స్ అన్నీ తిరిగి వస్తాయి.

45
డిలీట్ అయిన మెసేజ్ మళ్లీ ఎలా కనిపిస్తుంది?

మీరు రీస్టోర్ చేసిన బ్యాకప్‌లో ఆ మెసేజ్ సేవ్ అయి ఉంటే, అది మళ్లీ చాట్‌లో కనిపిస్తుంది. అంటే డిలీట్ చేసిన మెసేజ్ కూడా తిరిగి వస్తుంది. మీడియా ఫైళ్లు, ఫోటోలు, వీడియోలు కూడా బ్యాకప్‌లో ఉంటే తిరిగి రికవర్ అవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. బ్యాకప్ తీసుకున్న తర్వాత వచ్చిన కొత్త మెసేజ్‌లు Restore చేసినప్పుడు పోయే అవకాశం ఉంటుంది.

55
ఈ పద్ధతి ఉపయోగించే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఈ ట్రిక్ అన్ని సందర్భాల్లో పని చేయదు. WhatsApp Backup ముందుగా ఆన్‌లో లేకపోతే డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం సాధ్యం కాదు. అలాగే మెసేజ్ డిలీట్ అయ్యే ముందు బ్యాకప్ తీసి ఉండాలి. అందుకే ముఖ్యమైన చాట్స్ ఉంటే Google Drive లేదా iCloud బ్యాకప్‌ను రెగ్యులర్‌గా ఆన్‌లో ఉంచడం మంచిది. దీంతో అవసరమైనప్పుడు పాత మెసేజ్‌లను సులభంగా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories