కొత్త ఐకాన్స్, స్టార్ట్ మెనుతో మైక్రోసాఫ్ట్ విండోస్ 11 లాంచ్: 6 సంవత్సరాల తరువాత కొత్త వెర్షన్..

Ashok Kumar   | Asianet News
Published : Jun 25, 2021, 02:18 PM IST

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ 'విండోస్ -11'  నెక్స్ట్  జనరేషన్ వెర్షన్‌ను పరిచయం చేసింది. సుమారు ఆరు సంవత్సరాలు వెయిటింగ్  తర్వాత కొత్త వెర్షన్ తుకువచ్చారు. మైక్రోసాఫ్ట్ విండోస్ 10ను మొదట 2015లో లాంచ్ చేసింది.

PREV
15
కొత్త ఐకాన్స్, స్టార్ట్ మెనుతో మైక్రోసాఫ్ట్  విండోస్ 11 లాంచ్: 6 సంవత్సరాల తరువాత కొత్త వెర్షన్..

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 వినియోగదారులకు  ఈ అప్‌డేట్‌ను ఉచితంగా లభిస్తుందని తెలిపింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్  మొదటి వెర్షన్ 1985లో ప్రారంభించారు. ఈ ఏడాది చివరి నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

25

విండోస్ 11ను కొత్త స్టార్ట్ మెనూ, ఇతర ఫీచర్లతో ప్రవేశపెట్టిన తరువాత అందరినీ ఆశ్చర్యపరిచే మరో ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ గురువారం ప్రకటించింది. విండోస్ 11లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తున్న యాప్స్ కి  సపోర్ట్ లభించనుంది.ఇందుకోసం విండోస్ 11లోని అమెజాన్ యాప్‌స్టోర్ లో కొత్త విండోస్ స్టోర్ జత చేశారు. దీని కోసం మైక్రోసాఫ్ట్ ఇంటెల్ బ్రిడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు ఇంటెల్ తో జతకట్టింది. 
 
35

ఒక విధంగా ఈ చర్య మైక్రోసాఫ్ట్ ప్రత్యర్థి ఆపిల్‌కు సమాధానం అని కూడా భావించవచ్చు,  M1 చిప్‌ల సహాయంతో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS యాప్స్ నుండి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ Mac-OSలో యాప్స్ ఆపరేట్ చేయవచ్చు.మైక్రోసాఫ్ట్ 2015లో ప్రాజెక్ట్ ఆస్టోరియా పేరిట విండోస్‌లో ఆండ్రాయిడ్ యాప్స్ ప్రణాళికను ప్రవేశపెట్టింది, కాని  ఒక సంవత్సరం తరువాత  ఈ ప్రణాళిక విజయవంతంకాలేదని ప్రకటించారు. 
 
45

విండోస్ 11లో  స్పెషల్ ఏంటి :
కొత్త ఐకాన్స్, యానిమేషన్లు, కొత్త స్టార్ట్ మెను, యాప్స్ టాస్క్‌బార్ లేఅవుట్ విండోస్ 11లో చూడవచ్చు. అంతేకాకుండా కొత్త విండోస్‌తో కంపెనీ యాప్‌ను కూడా రిఆరెంజ్ చేయవచ్చు, ఇది మల్టీ మానిటర్ల నుండి బెనెఫిట్ పొందుతుంది. ఇంకా ఎక్స్‌బాక్స్ ఆటో హెచ్‌డిఆర్ సపోర్ట్, బ్లూటూత్ ఆడియోను ఇందులో మెరుగుపరచవచ్చు. మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ స్టోర్‌ పై కూడా పనిచేస్తోంది. 

55

ఈసారి కంపెనీ క్లౌడ్ బేస్డ్ విండోస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కొందరు చెబుతున్నారు. దీని  పెద్ద ప్రయోజనం ఏమిటంటే  ఈ సర్వీస్ సబ్ స్కిప్షన్ ఆధారితంగా ఉంటుంది, అలాగే  దీని వలన చాలా లాభం ఉంటుంది. క్లౌడ్ బేస్డ్ కావడంతో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్స్‌బాక్స్ వంటి గేమ్స్ తో ఎటువంటి సమస్య ఉండదు. మరో ప్రయోజనం ఏమిటంటే, కంపెనీ  అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఉపయోగించుకోగలదు, ఈ సంస్థ గత కొన్నేళ్లుగా పెట్టుబడులు పెడుతోంది.

click me!

Recommended Stories