WhatsApp : ఇక పేరెంట్స్‌కు నో టెన్షన్.. పిల్లల వాట్సాప్ ను మీరే హ్యాండిల్ చేయవచ్చు, ఎలాగో తెలుసా?

Published : Mar 12, 2026, 04:51 PM IST

పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో వాట్సాప్‌ను సురక్షితంగా వాడేందుకు "పేరెంట్-మేనేజ్డ్ అకౌంట్స్" అనే కొత్త ఫీచర్‌ వచ్చేసింది. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ ఫీచర్ తల్లిదండ్రులకు పెద్ద ఊరటనిస్తోంది.

PREV
14
వాట్సాప్ లో కొత్త ఫీచర్...

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరు వాట్సాప్ ను ఉపయోగిస్తుంటారు… చిన్నారులు కూడా వాడుతుంటారు. అందుకే పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఓ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేసింది.

13 ఏళ్లలోపు పిల్లల కోసం "పేరెంట్-మేనేజ్డ్ అకౌంట్స్" అనే ప్రత్యేక అకౌంట్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు వాట్సాప్‌ను సురక్షితంగా వాడేందుకు ఇది సాయపడుతుంది. అతి త్వరలో ఈ ఫీచర్‌ను యూజర్లకు దశలవారీగా అందిస్తామని వాట్సాప్ మాతృసంస్థ మెటా ప్రకటించింది.

24
ఈ వాట్సాప్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ ఫీచర్‌ను కుటుంబాలు, సైబర్ భద్రతా నిపుణుల సలహాలతో రూపొందించింది. చిన్న వయసులోనే మెసేజింగ్ యాప్స్ వాడే పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ అకౌంట్‌ను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత దాన్ని తమ వాట్సాప్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. దీనివల్ల పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారనేది పేరెంట్స్ సులభంగా గమనించవచ్చు.
34
పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్ ఇత సేఫా..!

పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్స్‌లో కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. పిల్లలు కేవలం పర్సనల్ మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ ద్వారా మాత్రమే మాట్లాడగలరు. వాళ్లు ఏ గ్రూపుల్లో చేరాలో కూడా తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. అదే సమయంలో స్టేటస్ అప్‌డేట్, ఛానెల్స్, మెటా ఏఐ వంటి ఫీచర్లు ఈ అకౌంట్లలో అందుబాటులో ఉండవు. తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు నేరుగా 'మెసేజ్ రిక్వెస్ట్' ఫోల్డర్‌లోకి వెళ్తాయి. ఆ ఫోల్డర్ తెరవాలంటే పేరెంట్స్ పిన్ (PIN) అవసరం.

44
తల్లిదండ్రుల పర్యవేక్షణ

అంతేకాకుండా పిల్లలు కొత్త కాంటాక్ట్‌ను యాడ్ చేసినా లేదా ఎవరినైనా బ్లాక్ చేసినా వెంటనే తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీస్‌పై పేరెంట్స్‌కు పూర్తి స్పష్టత ఉంటుంది.

అయితే భద్రత విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఇతర అకౌంట్ల లాగే ఈ అకౌంట్లకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-End Encryption) భద్రత ఉంటుంది. కాబట్టి పిల్లల సంభాషణలు ప్రైవేట్‌గా ఉంటాయని వాట్సాప్ స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories