Whatsapp Ban వాట్సాప్ 99 లక్షలు ఖాతాలు క్లోజ్! తప్పు చేశారు.. అనుభవించారు!!

సామాజిక మాధ్యమాల్లో మోసాల్ని అరికట్టేందుకు వాట్సప్ గట్టి చర్యలు తీసుకుంది. ఏకంగా 99 లక్షల ఖాతాలను మూసేసింది. స్పామ్ మెసేజ్‌లు, రూల్స్ బ్రేక్ చేసినందుకు ఈ యాక్షన్ తీసుకుంది. మీ ఖాతా ఆ జాబితాలో చేరకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.

Whatsapp Bans 99 Lakh Indian Accounts Spam and Rule Violations
బిగ్ షాక్

ప్రస్తుతం ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాపై అందరూ ఆధారపడుతున్నారు. వీటితో ఇంటర్నెట్ యుగంలో పనులన్నీ ఈజీ అయ్యాయి. కానీ, మోసాలు కూడా పెరుగుతున్నాయి.

Whatsapp Bans 99 Lakh Indian Accounts Spam and Rule Violations

చాలామంది సైబర్ క్రైమ్ బారిన పడ్డారు. భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మోసాల్ని అరికట్టేందుకు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. వాట్సాప్ 99 లక్షల అకౌంట్లు క్లోజ్ చేసింది. రూల్స్ బ్రేక్ చేసినందుకు 2021లోని గైడ్‌లైన్స్ కింద ఈ అకౌంట్లు బ్యాన్ చేశారు.


ఈ 99 లక్షల వాట్సాప్ అకౌంట్ల నుంచి స్పామ్ మెసేజ్‌లు, తప్పుడు సమాచారం పంపేవారని మెటా అంతర్గత విచారణలో తెలిసింది. అందుకే ఈ ఏడాది జనవరిలో 99,67,000 అకౌంట్లు బ్యాన్ చేశారు.

ఇతర యూజర్ల నుంచి అదేపనిగా ఫిర్యాదులు రావడం, స్పామ్ ఖాతాల గురించి సమాచారం అందించడంతో ఆ తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ చర్యలు తీసుకుంది. చివరికి 99 లక్షల వాట్సాప్ అకౌంట్లు క్లోజ్ చేశారు.

Latest Videos

vuukle one pixel image
click me!