71 లక్షల యూజర్లపై వాట్సాప్ నిషేధం! రూల్స్ ఉల్లంఘిస్తే ఇలా జరుగుతుంది!

First Published | Jun 5, 2024, 6:31 PM IST

మోసాలు, ప్రైవసీ పాలసీ ఉల్లంఘించినందుకు ప్రతి నెలా, WhatsApp లక్షల  అకౌంట్స్ నిషేధిస్తుంది. తాజా ప్రతినెల నివేదిక ప్రకారం, ఏప్రిల్ 1, 2024 నుండి  30, 2024 వరకు దాదాపు 71 లక్షల వాట్సాప్ అకౌంట్స్  తొలగించింది.
 

వాట్సాప్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కూడా ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు యూజర్లు ఇంకోసారి ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తే వారి అకౌంట్స్  బ్యాన్ చేసే యోచనలో ఉన్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది.
 

వాట్సాప్ ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మొత్తం 7,182,000 అకౌంట్స్  నిషేధించింది. వీటిలో 1,302,000 ఖాతాలు యూజర్ల  నుండి ఫిర్యాదులు రాకముందే నిషేధించబడ్డాయి. అనుమానాస్పద కార్యకలాపాల కోసం వాట్సాప్‌ను ఉపయోగించడాన్ని గుర్తించడానికి లేటెస్ట్  మెషీన్ లెర్నింగ్ అండ్  డేటా అనాలసిస్  పద్ధతులను ఉపయోగిస్తామని వాట్సాప్ తెలిపింది.
 

Latest Videos


ముఖ్యంగా, ఏప్రిల్ 2024లో, WhatsApp వివిధ కారణాల వల్ల యూజర్ల నుండి 10,554 ఫిర్యాదులను అందుకుంది. అయితే ఈ ఫిర్యాదుల ఆధారంగా కేవలం 6 అకౌంట్స్ పై మాత్రమే చర్యలు తీసుకున్నారు.

భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం, వాట్సాప్ అకౌంటలలో  దుర్వినియోగ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చాలా   అకౌంట్స్ పై చర్యలు తీసుకోబడుతున్నాయి.

జూన్ 2024 నివేదికలో, వాట్సాప్ యూజర్ల ఫిర్యాదులపై చర్య తీసుకోవడానికి మెరుగైన ఇంకా  అధునాతన సౌకర్యాలను ప్రవేశపెట్టినట్లు గుర్తించింది.

WhatsApp అకౌంట్స్  ఎందుకు నిషేధిస్తుంది?

 WhatsApp యూజర్లకు సురక్షితమైన వాతావరణాన్ని కొనసాగించడానికి  ఈ అకౌంట్స్  నిషేధించింది. ఈ అకౌంట్స్  నిషేధించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి.

1. సర్వీస్ నిబంధనల ఉల్లంఘన: స్పామ్, స్కామ్‌లు, తప్పుడు సమాచారం, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం సర్వీస్  నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

2. చట్టపరమైన ఉల్లంఘనలు: భారతీయ చట్టాలను ఉల్లంఘించే అకౌంట్స్  వెంటనే నిషేధించబడతాయి.

3. తప్పుడు ప్రవర్తన: వాట్సాప్ వినియోగదారులు తప్పుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదు ఆధారంగా వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది.
 

WhatsApp అకౌంట్స్  ఎలా నిషేధిస్తుంది?

వాట్సాప్ దుర్వినియోగాన్ని గుర్తించడానికి మల్టి  విధానాన్ని ఉపయోగిస్తుంది. WhatsApp అకౌంట్  క్రియేట్ చేసేటప్పుడు అనుమానాస్పద పోస్ట్‌లను గుర్తించి బ్లాక్ చేసే ఫీచర్స్  WhatsAppలో  ఉంది. దీని ద్వారా అనుమానాస్పద వ్యక్తులు వాట్సాప్‌లో అకౌంట్  తెరవకుండా అడ్డుకుంటుంది.

WhatsApp స్పామ్ మెసేజెస్, బెదిరింపులు లేదా తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి ప్రత్యేక అల్గారిథమ్‌లను కూడా ఉపయోగిస్తుంది. వాట్సాప్  యూజర్ల అభిప్రాయాన్ని సీరియస్‌గా తీసుకుంటుంది. యూజర్లు రిపోర్ట్ చేసినప్పుడు WhatsApp దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటుంది.

click me!