మీ వాట్సాప్ ఫోటో ఎవరైనా స్క్రీన్‌షాట్ తిసుస్తున్నారా..? జస్ట్ డోంట్ వర్రీ..

First Published May 15, 2024, 11:58 AM IST

వాట్సాప్ డిపి అని పిలువబడే ప్రొఫైల్ ఫోటోల దుర్వినియోగ సంఘటనల మధ్య వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.
 

వాట్సాప్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ఎందుకంటే  యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తుంది. సోషల్ మీడియా పరిధి పెరిగే కొద్దీ ప్రైవసీ కూడా పెరిగింది.
 

ప్రొఫైల్ ఫొటోలను దుర్వినియోగం చేసే ఉదంతాలు ఈ మధ్య చాలానే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రైవసీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన వాట్సాప్ డీపీ వంటి సెక్యూరిటీ ఫీచర్లను అందించింది.
 

Latest Videos


కొన్నిసార్లు స్క్రీన్‌షాట్‌లు తీసుకుని వాట్సాప్ డీపీలను దుర్వినియోగం చేస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.
 

మన ప్రొఫైల్ పిక్చర్ లేదా వాట్సాప్ డీపీని ఎవరైనా స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఫోటోకు బదులుగా బ్లాక్ స్క్రీన్ చూపించే ఫీచర్ తో  వాట్సాప్ వస్తుంది.

ఈ విధంగా ఎవరూ మీ DP లేదా స్టేటస్  స్క్రీన్‌షాట్ చేయలేరు. ఈ ఫీచర్‌ని స్క్రీన్‌షాట్ బ్లాగింగ్  అని అంటారు. దీనిని ఇప్పటికే ఆండ్రాయిడ్లో పరీక్షించబడుతోంది.
 

అయితే ఈ ఫీచర్‌ని ఐఓఎస్‌లో కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బీటాలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
 

click me!