ఆపిల్ ఐఫోన్ పై బ్యాన్.. కారణాలను వెల్లడిస్తూ చర్య.. మీరు కూడా దీన్ని చెక్ చేసారా..

First Published | Sep 22, 2023, 6:30 PM IST

కొద్దిరోజుల క్రితం ఆపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. అయితే  ఐఫోన్ 12 మోడల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఫ్రాన్స్ దేశంలో నిషేధం   విధించారు. ఐఫోన్ 12లో స్టాండర్డ్ కంటే ఎక్కువ రేడియేషన్‌ను కనుగొన్న తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన రేడియేషన్ మానిటరింగ్ సంస్థ ANFR ఈ చర్య తీసుకుంది. 

 కొన్ని సాంపుల్స్  పరీక్షించిన తర్వాత, ANFR (ఏజెన్స్ నేషనల్ డెస్ ఫ్రీక్వెన్సెస్) ఐఫోన్ 12  స్పెసిఫిక్ అబ్సర్ప్షన్ రేటు (SAR) యూరోపియన్ యూనియన్ (EU) నిర్ణయించిన రేడియేషన్ ఎక్స్‌పోజర్ పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉందని అంగీకరించింది. అయితే, ఆపిల్   మోడల్స్ అన్నీ గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాడుతున్న ఫోన్ ఎంత రేడియేషన్ చేస్తుంది,  ఎంత వరకు సురక్షితమైనది అనే అనే ప్రశ్న తలెత్తుతుంది.... అయితే ఫోన్ రేడియేషన్‌ను కొలిచే పద్ధతిని తెలుసుకుందాం... 

SAR లెవెల్  అంటే ఏమిటి?

విద్యుదయస్కాంత తరంగాల( electromagnetic waves)ను స్వీకరించినప్పుడు ఇంకా  ప్రసారం చేసినప్పుడు తరంగాలలో కొంత శాతం పోతుంది. ఈ నష్టం శాతం పరిసర కణజాలం ద్వారా గ్రహించబడుతుంది. SAR వాల్యూ అనేది ఈ కోల్పోయిన విద్యుదయస్కాంత తరంగాలను బాడీ గ్రహించే రేటు.  వైర్‌లెస్ నెట్‌వర్క్‌లో పనిచేయడానికి ఫోన్‌లు రేడియో ట్రాన్స్‌మిటర్లు అండ్  రిసీవర్‌లను ఉపయోగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో అవి  రేడియో తరంగాలను విడుదల చేస్తాయి, ఇవి క్యాన్సర్ కారకాలు ఇంకా హానికరం.
 


ఫోన్ SAR లెవెల్ ఎంత ఉండాలి?

USలోని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) ప్రకారం, ఫోన్   SAR లెవెల్  1.6 W kg ఉండాలి. భారతదేశంలో కూడా అదే కొలతను అనుసరిస్తాయి. ఫోన్ SAR లెవెల్  1.6W/kg కంటే తక్కువగా ఉంటే ఫోన్ బాగానే ఉందని అర్థం.
 

మీ ఫోన్ SAR లెవెల్  ఎంత?

మీ ఫోన్   SAR లెవెల్  దాని ప్యాకేజింగ్ వెనుక వ్రాసి ఉంటుంది. చాలా ఫోన్ కంపెనీలు వాటి  వెబ్‌సైట్లలో కూడా ఈ సమాచారాన్ని అందిస్తాయి. మీరు SAR వాల్యూను అంటే మీ ఫోన్  రేడియేషన్‌ను చెక్  చేయాలనుకుంటే, మీరు మీ ఫోన్‌లో *#07# డయల్ చేయడం ద్వారా SAR లెవెల్ చెక్ చేయవచ్చు. అయితే, ఈ కోడ్ కొన్ని మోడళ్లలో పనిచేయదు. మీరు మీ ఫోన్  సెటింగ్స్ లో  about phone  క్లిక్ చేసి  అక్కడ  మీరు  దాన్ని చెక్  చేయవచ్చు.

Latest Videos

click me!