వివో వి21 నియాన్ స్పార్క్ కలర్ వేరియంట్ అన్ని ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి రూ .29,990 కి కొనుగోలు చేయవచ్చు. వివో వి21ని ఈ ఏడాది ఏప్రిల్‌లో భారతీయ మార్కెట్లో మొదట ప్రవేశపెట్టరు. వివో వి21 5జి మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.
వివో వి21 5జి
వివో వి 21 5జి స్పెసిఫికేషన్‌లు చూస్తే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఉంది. అంతేకాకుండా 6.44-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ AMOLED డిస్‌ప్లేతో 1080x2404 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz. MediaTek Dimensity 800U ప్రాసెసర్ ఫోన్‌లో ఇచ్చారు. 8 జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ అందించారు. ఫోన్‌లో 3 జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.