నిన్న ఫేస్ బుక్, వాట్సప్ నేడు జీమెయిల్.. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిలిచిపోయిన సేవలు..

First Published | Oct 12, 2021, 7:03 PM IST

గూగుల్  ఉచిత ఈమెయిల్ సర్వీస్స్ జిమేయిల్ మంగళవారం (అక్టోబర్ 12) దేశంలోని చాలా ప్రాంతాల్లో నిలిచిపోయింది. దీంతో  వినియోగదారులు ఈమెయిల్ పంపాలేకపోవడం లేదా పొందలేకవడంలో సమస్యలు ఎదురుకొన్నారు. ఈ సమస్య గంటల తరబడి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై  గూగుల్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనికి సంబంధించి చాలా మంది జిమేయిల్ యూజర్లు  ఫిర్యాదులను కూడా దాఖలు చేశారు.

డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం ఫిర్యాదులు చేసిన వారిలో  68 శాతం మంది జిమేయిల్ తో సమస్యలు ఉన్నట్లు నివేదించారు, అయితే 18 శాతం సర్వర్ కనెక్షన్‌లలో సమస్య ఉందని, 14 శాతం మంది వినియోగదారులు లాగిన్‌లో సమస్య ఉందని చెప్పారు. భారతదేశంతో పాటు ఇతర దేశాల వినియోగదారులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి సమాచారం ఇచ్చారు. వారు కూడా జిమెయిల్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
 

వినియోగదారుల సమస్య ఏమిటంటే
ఒక యూజర్ ప్రకారం ఈమెయిల్ పంపలేకపోవడం లేదా పొందలేకపోవడంలో సమస్యలు ఎదురుకొంటున్నట్లు తెలిపారు. ఇంకొకరు జిమేయిల్  డౌన్ అయ్యింది అని  మరొక యూజర్ 'నా  జిమేయిల్ పని చేయడం లేదు ఈ సమస్య నాకు మాత్రమే జరుగుతుందా లేక మరొకరు కూడా ఎదుర్కొంటున్నారా అని పోస్ట్ చేశారు.
 

Latest Videos


కొద్దిరోజుల క్రితం వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్తగ్రామ్ మూడు ఒకేసారి 6 గంటలపాటు నిలిచిపోయాయి. దీనికంటే ముందు కూడా ఫేస్ బుక్ డౌన్ అయ్యింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా దిగ్గజాలు  నిలిచిపోవడం వినియోగదారులను ఆందోళన కలిగిస్తుంది.
 

click me!