మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ బైన్ అండ్ కో ద్వారా 'ఆన్‌లైన్ వీడియో ఇన్ ఇండియా - కీ యాస్పెక్ట్స్' ఇటీవల విడుదల చేసిన నివేదికలో కరోనా(corona) వ్యాప్తి వల్ల దేశవ్యాప్త లాక్ డౌన్(lock down) సమయంలో ప్రజలు ఆన్‌లైన్ వీడియో(online video)లను ఎక్కువగా చూస్తున్నారని తేలింది. ప్రజలు వీడియోలను చూడటానికి గడిపే సమయం 60 నుండి 70 శాతం పెరిగింది. నివేదిక ప్రకారం, భారతదేశంలో ఈ గణాంకాలు మరింత వేగంగా పెరుగుతాయి. నేడు భారతదేశంలో 60 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు వీడియోలను ఆన్‌లైన్‌లో చూస్తుండగా, చైనాలో ఈ సంఖ్య 90 శాతానికి పైగా ఉంది. భారతదేశంలో దాదాపు 640 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు, వారిలో 550 మిలియన్లు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు.
పొడవైన వీడియోలు
ఈ నివేదికలో 35 నుంచి 40 కోట్ల మంది ప్రజలు పొడవైన వీడియోలను చూడటానికి ఇష్టపడుతున్నారని వెల్లడైంది. అయితే ప్రజలు చిన్న వీడియోలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారట. పెద్ద వీడియోలను చూసే వారి సంఖ్య ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా పెరిగింది. 2018తో 2020 పోలిస్తే దాదాపు ఒకటిన్నర రెట్లు పెరుగుదల ఉంది. కరోనా లాక్ డౌన్ ఊన్నప్పటి నుండి యాక్టివ్ యూజర్లు రోజుకి 2.5 గంటల కంటే ఎక్కువ నిడివి గల వీడియో ప్లాట్‌ఫారమ్‌లో గడుపుతున్నట్లు తెలుస్తుంది. అలాంటి వినియోగదారులు 2025 సంవత్సరం నాటికి 50 కోట్ల నుండి 65 కోట్లకు పెరుగుతారని అంచనా. ఈ నివేదికలో విశ్లేషకులు 15 సెకన్ల నుండి రెండు నిమిషాల వ్యవధి గల వీడియోలను చిన్న వీడియోలుగా రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి వీడియోలను పొడవైన వీడియోలుగా పరిగణించారు.
టిక్‌టాక్ వచ్చిన తర్వాత వీడియో మార్కెట్
భారతదేశంలో చిన్న వీడియోల మార్కెట్ టిక్‌టాక్(tiktok) రాకతో ప్రారంభమైంది. చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ పై భారతదేశం నిషేదించినప్పటికి షార్ట్ వీడియో(short videos) క్రేజ్ నిరంతరం పెరుగుతు వస్తుంది. షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారుల సంఖ్య 3.5 రెట్లు పెరిగింది. ప్రజలు షార్ట్ వీడియోస్ పై సమయాన్ని కేటాయించడం కూడా 12 రెట్లు పెరిగింది.
2020 సంవత్సరంలో కనీసం 200 మిలియన్లకు పైగా భారతీయులు చిన్న వీడియోలను చూస్తున్నారు. యాక్టివ్ యూజర్ ప్రతిరోజూ ఈ ప్లాట్‌ఫారమ్‌లపై 45 నిమిషాల వరకు గడుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ (ఫేస్‌బుక్), యూట్యూబ్ (గూగుల్), నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద కంపెనీలు చిన్న, పెద్ద వీడియోలపై దృష్టి సారిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద వీడియోలను అందించే యూట్యూబ్, చిన్న వీడియోల కోసం యూట్యూబ్ షాట్‌లతో కూడా ముందుకు వచ్చింది.