లావా ప్రోబడ్స్ ధరలావా ప్రోబడ్స్ టిడబ్ల్యుఎస్ ధర రూ .1,199. జూన్ 24 నుండి లావా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించనున్నారు, అయితే కస్టమర్లకు సేల్ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేవలం రూ.1 కొనుగోలు చేసే అవకాశం కూడా అందిస్తుంది. దీనితో పాటు ఒక సంవత్సరం వారంటీతో బ్లాక్ కలర్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.
లావా ప్రోబడ్స్ స్పెసిఫికేషన్లులావా ప్రోబడ్స్ ఇయర్‌బడ్స్‌లో 55 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ కేసులో 500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఛార్జింగ్ తో బ్యాటరీ 25 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది. మీడియాటెక్ ఐరోహా చిప్‌సెట్ సపోర్ట్ తో బడ్స్‌లో అధునాతన 11.6 ఎంఎం డ్రైవర్ ఇచ్చారు. అందుకే గొప్ప బేస్ ఇస్తుందని పేర్కొంది.
లావా ప్రోబడ్స్‌తో ఇన్‌స్టంట్ వేక్, పెయిర్ టెక్నాలజీకి సపోర్ట్ తో లావా ప్రొ బడ్స్ వస్తున్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి5, అలాగే ఛార్జింగ్ కోసం మైక్రో యుఎస్‌బి పోర్ట్ అందుబాటులో ఉంటుంది. దీని బరువు 77 గ్రాములు. ఈ ఇయర్‌బడ్స్‌కు వాటర్ ఇంకా చెమట నిరోధకత కోసం ఐపిఎక్స్ 5 రేటింగ్ లభించింది. బడ్స్ కి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది.