దీని సహాయంతో ఐఓఎస్ వినియోగదారులు చిన్న విండోలో వీడియోలను ప్లే చేయడం ద్వారా ఇతర యాప్స్ కూడా ఉపయోగించగలుగుతారు. అయితే పిఐపి మోడ్ ఫేస్ టైమ్ అండ్ వీడియో చూడటానికి మాత్రమే ఉండేది. కానీ యూట్యూబ్ యాప్ లో పిఐపికి సపోర్ట్ లేదు. ఈ కొత్త అప్ డేట్ మొదట యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
undefined
పిఐపి అప్ డేట్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులు ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ మల్టీ టాస్కింగ్ చేయవచ్చు. కొత్త అప్ డేట్ ప్రస్తుతం యు.ఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, అయితే త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
undefined
మరో విశేషమేమిటంటే ఆపిల్ ఇటీవల కొత్త ఓఎస్ ఐఓఎస్ 15ను డబల్యూడబల్యూడిసి 2021లో విడుదల చేసింది. ఐఓఎస్ 15తో పాటు ఐమెసేజ్, ఫేస్ టైమ్ కు సంబంధించి కూడా చాలా మార్పులు చేసింది. అంతేకాకుండా గోప్యతకు సంబంధించి అనేక కొత్త ఫీచర్లు ప్రారంభించింది. ఇంకా షేర్ చేయడానికి సిస్టమ్‌వైడ్ సపోర్ట్ కూడా ఉంది. డివైజ్ ఇంటెలిజెన్స్ కోసం చాలా అప్ డేట్స్ ఇచ్చింది.
undefined
ఐఓఎస్ 15 అప్ డేట్ ఐఫోన్ 6ఎస్ సిరీస్ నుండి ఇప్పటి వరకు ఉన్న ఐఫోన్ 12 సిరీస్ వరకు అన్ని మోడళ్లకు అందుబాటులో ఉంటుంది. పబ్లిక్ బీటా వచ్చే నెలలో విడుదల కానుంది. ఐఓఎస్ క్విక్‌పాత్ స్వైప్ కీబోర్డ్‌కు కూడా హిందీ భాష సపోర్ట్ లభిస్తుంది. ఐప్యాడ్ ఓఎస్ 15ని డబల్యూడబల్యూడిసి 2021లో ప్రవేశపెట్టరు.
undefined