స్మార్ట్ ఫోన్ లేదా.. మీ ఫీచర్ ఫోన్ నుండి ఇంటర్నెట్ లేకుండా కూడా డబ్బు పంపవచ్చు.. ఎలా అంటే ?

First Published Sep 14, 2021, 1:03 PM IST

 ఈ రోజుల్లో ఒక వార్త చాలా వైరల్ అవుతోంది, ఇందులో ఇంటర్నెట్ లేకుండా కూడా మీరు యూ‌పి‌ఐ పేమెంట్ చేయవచ్చు అని పేర్కొంది. అంతేకాదు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా ఎవరికైనా డబ్బు పంపవచ్చు. ఇంటర్నెట్ లేకుండా యూ‌పి‌ఐ చెల్లింపు చేసే మార్గం అని వార్తలలో తెలిపింది. 

మీరు ఇంటర్నెట్ లేకుండా యూ‌పి‌ఐ చెల్లింపు చేయవచ్చు అనేది నిజం, కానీ దీని కోసం మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, దీని గురించి వస్తున్న వైరల్ వార్తల్లో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంటర్నెట్ లేదా ఫీచర్ ఫోన్‌లు లేకుండా యూ‌పి‌ఐ చెల్లింపులు ఎలా చేయాలో తెలుసుకోండి..

*99# యూ‌ఎస్‌ఎస్‌డి కోడ్ అంటే ఏమిటి?

2012 సంవత్సరంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పి‌సి‌ఐ) యూ‌ఎస్‌ఎస్‌డి కోడ్ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రారంభంలో దీనిని ఎం‌టి‌ఎన్‌ఎల్, బి‌ఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం మాత్రమే ప్రవేశపెట్టరు. తరువాత 2016లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూ‌పి‌ఐ) ప్రారంభించారు. ఈ యూ‌పి‌ఐ స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది. *99#  యూ‌ఎస్‌ఎస్‌డి ప్రారంభం ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉంచడమే ఉద్దేశ్యం. ఇప్పుడు *99#  యూ‌ఎస్‌ఎస్‌డి కోడ్ అన్ని టెలికాం కంపెనీలకు అందుబాటులో ఉంది.

*99# యూ‌ఎస్‌ఎస్‌డి సహాయంతో ఇంటర్నెట్ లేకుండా డబ్బు పంపడం ఎలా?

ముందుగా ఏదైనా మొబైల్ (స్మార్ట్ ఫోన్ లేదా ఫీచర్ ఫోన్) నుండి *99# డయల్ చేయండి.
ఇప్పుడు మీ ముందు ఒక మెనూ కనిపిస్తుంది, ఇందులో మీరు మీ బ్యాంక్ పేరు లేదా మీ బ్యాంక్ ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ మొదటి నాలుగు అంకెలను ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబర్ తో లింక్ చేసిన (రిజిస్టర్డ్) బ్యాంక్ ఖాతాల జాబితాను పొందుతారు.
ఇప్పుడు ఇచ్చిన నంబర్ (1,2,3 ...) తో ఆ బ్యాంక్ ఖాతాకు  సెలెక్ట్ చేసుకొని రిప్లయి ఇవ్వండి.

ఇప్పుడు మీరు మీ బ్యాంక్  డెబిట్ కార్డ్ (ATM) కార్డు చివరి 6 అంకెలను నొక్కి, ఆపై సెండ్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు డెబిట్ కార్డు గడువు తేదీని పేర్కొనవలసి ఉంటుంది, ఆ తర్వాత మీ యూ‌పి‌ఐ పిన్ జనరేట్ అవుతుంది.
ఇప్పుడు మళ్లీ మీరు *99# డయల్ చేయాలి
*99#డయల్ చేసిన తర్వాత మీకు డబ్బు పంపడం నుండి లావాదేవీ సమాచారం వరకు ఆప్షన్స్ లభిస్తాయి.
మీరు డబ్బు పంపాలనుకుంటే 1 నొక్కడం ద్వారా రిప్లయి ఇవ్వండి.

ఆ తర్వాత మీరు ఎవరికి డబ్బు పంపాలనుకుంటున్నారో వారి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
ఇప్పుడు మీరు ఎంత డబ్బు పంపాలి అని అడుగుతుంది, దాని గురించి సమాచారం ఇవ్వండి.
ఇప్పుడు చెల్లింపు కోసం యూ‌పి‌ఐ పిన్ ఎంటర్ చేయండి. దీంతో  చెల్లింపు చేయబడుతుంది.
దయచేసి గమనించండి *99# మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన మొబైల్ నంబర్‌తో మాత్రమే పని చేస్తుంది. యూ‌పి‌ఐ పిన్ మీ డెబిట్ కార్డ్ (ATM) కార్డు చివరి 6 అంకెలు.

click me!