జాగ్రత్త: ఆపిల్ వార్నింగ్.. మీరు ఇలా చేస్తే మీ ఐఫోన్ కెమెరా దెబ్బతింటుంది..

First Published | Sep 13, 2021, 4:35 PM IST

అమెరికన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సంస్థ ఆపిల్ వినియోగదారుల కోసం ఒక హెచ్చరిక జారీ చేసింది. హై పవర్ కలిగిన బైక్ పై ఐఫోన్‌ను ఉపయోగించకుండా ఉండాలని కంపెనీ సూచించింది. మీరు ఇలా చేస్తే మీ ఐఫోన్ కెమెరా ప్రభావితమయ్యే అవకాశం ఉంది అలాగే మీరు మెరుగైన ఫోటోలను తీయలేకపోవచ్చు అని తెలిపింది. 

సాధారణంగా బైక్ రైడ్ చేసేటప్పుడు లేదా యుట్యూబర్లు  బైక్ రైడింగ్ లేదా రేసింగ్ చేసేటప్పుడు బైక్ కి స్మార్ట్ ఫోన్ అమర్చి వీడియోస్ తీస్తుంటారు. హై స్పీడ్ బైక్స్ పై ఆపిల్ ఐఫోన్ కెమెరా వాడటం వల్ల ఫోన్ కెమెరా ప్రభావానికి గురవుతుందని వెల్లడించింది.

యాపిల్ సపోర్ట్ పేజీలో ఈ సమాచారం ఇస్తూ హై పవర్ ఇంజిన్ ఉన్న బైక్ నుండి వెలువడే వైబ్రేషన్స్, వెవ్స్ ఫోన్ కెమెరాను ప్రభావితం చేయగలవని ఆపిల్ పేర్కొంది. 
 

Latest Videos


కొన్ని ఐఫోన్‌లో లేటెస్ట్ కెమెరా

యాపిల్ కొన్ని ఐఫోన్ మోడళ్లలో అధునాతన కెమెరా సిస్టమ్‌ను ఇచ్చింది. దీని ద్వారా మీరు ఆప్టికల్ ఇమేజ్, స్టెబిలైజేషన్, క్లోజ్డ్ లూప్ ఆటోఫోకస్ టెక్నాలజీతో క్లిష్ట  సమయాల్లో  కూడా మెరుగైన ఫోటోలను తీసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఆటోమేటిక్ గా ఏదైనా కదలిక, వైబ్రేషన్, గ్రావిటి ఎఫెక్ట్స్  ప్రభావాలను న్యూట్రలైజ్ చేస్తుంది, ఇంకా మెరుగైన ఫోటోను తీయడంలో సహాయపడుతుంది. 
 

లైట్ ఇంజన్ వాహనాలపై

ఆపిల్ ఐఫోన్‌ను అధిక శక్తి ఇంజిన్‌పై  ఉపయోగించవద్దని కోరింది. మీరు ఫోన్‌ను లైట్ ఇంజిన్ స్కూటర్ లేదా ఎలక్ట్రానిక్ బైక్‌పై ఉపయోగించొచ్చని  సూచించింది. మీరు అధిక శక్తి బైక్స్ పై ఉపయోగిస్తే ఫోన్ ఐ‌ఓ‌ఎస్, ఏ‌ఎఫ్ సిస్టమ్ దెబ్బతినవచ్చు. 

ఈ ఐఫోన్‌లలో ఓ‌ఐ‌ఎస్ సిస్టమ్

మీ ఐఫోన్‌లో ఐ‌ఓ‌ఎస్ సిస్టమ్ ఉంటే మీరు దానిని అధిక శక్తి కలిగిన బైక్ పై ఉపయోగిస్తే దాని ఓ‌ఐ‌ఎస్ సిస్టం ప్రభావితమవుతుందని ఆపిల్ తెలిపింది. ఆపిల్ ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్‌ఇ2 సెకండ్ జనరేషన్ లో ఓఐఎస్ సిస్టమ్ ఉంది. 

click me!