అయితే అక్కడ గ్రహాంతరవాసుల జీవితం ఎలా ఉంటుంది..? గ్రహాంతరవాసులు ఎలా ఉంటారు..? వారు ఎలా కనిపిస్తారు..? అసలు వారు ఏం తింటారు.. ఏం తాగుతారు? వీరు నిజంగానే గ్రహాంతరవాసులా..? ఇప్పటివరకు ఈ విషయాలన్నీ కేవలం కల్పనలు, అనుభవాలపై ఆధారపడి ఉన్నాయి. బాలీవుడ్ లేదా హాలీవుడ్ సినిమాలలో మనం ఇప్పటివరకు చూసిన గ్రహాంతరవాసులు కల్పనలు ఆధారంగా రూపొందించారు. ఎందుకంటే, గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా అని మన శాస్త్రవేత్తలు ఇంకా కనుగొనలేకపోయారు..?
నాసా అధికారిక ఇన్స్తగ్రామ్ పేజీలో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నారా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ప్రతిస్పందనగా నాసా శాస్త్రవేత్త డాక్టర్ లిండ్సే హేస్ ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ప్రశ్న అని చెప్పారు. భూమిపై కాకుండా ఏ గ్రహం మీద అయినా జీవం ఉందో లేదో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కూడా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.
దీనిని తెలుసుకునేందుకు యుఎస్ స్పేస్ ఏజెన్సీ ఐదు రోవర్‌లను, నలుగురు ల్యాండర్‌లను అంగారక గ్రహంపైకి పంపించిందని ఆమె చెప్పారు. ఈ రోవర్‌లు, ల్యాండర్లు అంగారకుడిపై కనుగొనేందుకు హై రిజల్యూషన్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ మేము అంగారకుడిపై కొంత భాగాన్ని మాత్రమే గుర్తించగలిగాము. అందుకే గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అని చెప్పలేకపోతున్నాము.
అమెరికన్ వ్యోమగామి, రచయిత కార్ల్ సాగన్ విశ్వం చాలా పెద్దది, అనంతమైనది. ఈ విశ్వంలో మనం మాత్రమే ఉంటే అది వ్యర్థం అని పేర్కొన్నాడు. ఏదేమైనా నాసా శాస్త్రవేత్త డాక్టర్ లిండ్సే భూమి కాకుండా మరే ఇతర గ్రహం మీద జీవం ఉందో లేదో తెలుసుకుంనేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు.