సామ్‌సంగ్ నుండి వన్‌ప్లస్ వరకు ఈ నెలలో లాంచ్ కానున్నలేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

First Published | Jul 5, 2021, 6:48 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్  శామ్సంగ్, షియోమి, రియల్ మీ నుండి వన్‌ప్లస్ వరకు  ఈ నెలలో లేటెస్ట్ అప్ డేట్  స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లోకి  రాబోతున్నాయి. దేశీయ కంపెనీ మైక్రోమాక్స్ కూడా ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ నెలలో లాంచ్ కానున్న కొన్ని స్మార్ట్ ఫోన్స్  వివరాలు మీకోసం...
 

రియల్‌మీ జిటి 5జి మాస్టర్ ఎడిషన్రియల్‌మీ కెమెరా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ జిటి కూడా ఈ నెలలో భారత్‌లో విడుదల కానుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో 108 మెగాపిక్సెల్ కెమెరా అందించవచ్చు. 45W mAh బ్యాటరీతో 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
మైక్రోమాక్స్ ఇన్2బి మైక్రోమాక్స్ ఇన్2బి బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నవారి కోసం ఈ నెలలో తీసుకురాబోతున్నారు. దీనిలో 4 జీబీ ర్యామ్‌తో యునిసోక్ టి 610 ప్రాసెసర్‌ పొందవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11తో లాంచ్ కానుంది.

రెడ్‌మి 10 సిరీస్రెడ్‌మి 10 సిరీస్ కూడా ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్ రెడ్‌మి 9 సిరీస్ కి అప్‌గ్రేడ్ సిరీస్ అవుతుంది. రెడ్‌మి 10ఎ, రెడ్‌మి 10 పవర్‌ను ఈ సిరీస్ కింద లాంచ్ చేయవచ్చు. ఈ ఫోన్‌ల ధరలు 10,000 నుంచి 20,000 మధ్య ఉంటాయి.
వన్‌ప్లస్ నార్డ్ 2వన్‌ప్లస్ తాజాగా భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ సిఇని లాంచ్ చేసింది. దీనిని మిడ్‌రేంజ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ 2 త్వరలో భారత్‌లో విడుదల కానుట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాటెక్ 5జి ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించవచ్చు. అంతేకాకుండా దీని డిజైన్ వన్‌ప్లస్ 9 సిరీస్ లాగా ఉంటుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ.30,000 ఉంటుందని అంచన.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22 స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ ఎ22కి రీ-బ్రాండెడ్ వెర్షన్. ఈ ఫోన్‌ను ఇటీవల గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ సైట్‌లో గుర్తించారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22ను మీడియాటెక్ హెలియో జి80 ప్రాసెసర్, 25w ఫాస్ట్ ఛార్జింగ్ తో భారత్‌లో లాంచ్ చేయవచ్చు. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావొచ్చు.

Latest Videos

click me!