ఇండియా తరువాత సోషల్ మీడియా సంస్థలపై రష్యా కొత్త ఐటి రూల్స్.. వాటిని ఆపడానికే ఈ నిర్ణయం..

First Published Jul 2, 2021, 7:35 PM IST

 భారత ప్రభుత్వం ఇటీవల కొత్త ఐటి చట్టాన్ని అమలు చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే దీని తరువాత చాలా వివాదాలు మొదలయ్యాయి. సకాలంలో కొత్త ఐటి నిబంధనలను పాటించకపోవడం వల్ల ట్విట్టర్ కి చట్టపరమైన రక్షణను కూడా ఇండియా ఉపసంహరించుకుంది, ఆ తర్వాత కేవలం 10 రోజుల్లోనే ట్విట్టర్‌పై  పలు ఎఫ్‌ఐఆర్‌లు చోటు చేసుకున్నాయి. 

భారతదేశం తరువాత ఇప్పుడు రష్యా కూడా సోషల్ మీడియాకు సంబంధించి కొత్త చట్టాలను తీసుకురాబోతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త ఐటీ చట్టంపై సంతకం కూడా చేశారు. ఈ చట్టం అమలు తరువాత గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో సహా అన్ని సోషల్ మీడియా సంస్థలు రష్యాలో తమ కార్యాలయాలను తెరవాల్సి ఉంటుంది. రష్యా ప్రభుత్వం జారీ చేసిన నివేదిక నుండి ఈ సమాచారం వెల్లడైంది. సోషల్ మీడియా సంస్థల ఏకపక్షతను ఆపడానికి పుతిన్ ప్రభుత్వం కొత్త ఐటి చట్టాన్ని తీసుకువస్తోందని కొందరు చెబుతున్నారు.
undefined
రష్యా కొంతకాలంగా విదేశీ ఐటి కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోందని, కొత్త చట్టం కూడా దానిలో ఒక భాగమని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం రష్యా కొన్ని ఆన్‌లైన్ కంటెంట్‌ను చట్టవిరుద్ధమని ప్రకటించింది, అలాగే దానిని తొలగించనందుకు టెక్ అండ్ సోషల్ మీడియా సంస్థలకు జరిమానా కూడా విధించింది.
undefined
అంతేకాకుందా దీనికి శిక్షగా అమెరికన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేగాన్ని తగ్గించాలని కూడా రష్యా నిర్ణయించింది. ఇటీవల రష్యా గూగుల్‌పై ఒక కొత్త కేసును నమోదు చేసింది.
undefined
గత నెల మే 26 నుండి భారత ప్రభుత్వం కొత్త ఐటి నిబంధనలను అమలు చేసింది. దీని కింద సోషల్ మీడియా కంపెనీలు భారతదేశంలో గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా కంటెంట్‌కు సంబంధించి ఫిర్యాదు ఉంటే దానిని 24 గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి నెలా ప్రభుత్వనికి ఫిర్యాదులను నివేదించాలి.
undefined
click me!