జియో, ఎయిర్‌టెల్ కస్టమర్‌లకు జాక్‌పాట్.. ఆన్ లిమిటెడ్ 5G డేటా.. పూర్తి వివరాలు ఇదిగో !!

First Published | Sep 11, 2023, 11:44 AM IST

టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో అండ్ ఎయిర్‌టెల్ రూ.250 లోపు ఉన్న ప్లాన్‌లతో  కస్టమర్లకు  ఆన్ లిమిటెడ్ 5G డేటాను అందిస్తున్నాయి. మీరు చాలా తక్కువ ధరలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించాలనుకుంటే, రిలయన్స్ జియో ఇంకా ఎయిర్‌టెల్ మీ కోసం అద్భుతమైన ప్లాన్‌లను  తీసుకొచ్చాయి. ఈ ప్లాన్‌లతో మీరు ఆన్ లిమిటెడ్ 5G డేటాను పొందుతారు.
 

ఈ ప్లాన్‌లు ఇంకా ప్రతిరోజు  ఆన్ లిమిటెడ్  కాల్స్ ఇంకా  ఫ్రీ SMS సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. ఈ ప్లాన్‌లతో మీరు ఇతర బెనెఫిట్స్ కూడా పొందుతారు.  ఈ Jio, Airtel ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధర రూ.250 కంటే తక్కువ. కాబట్టి ఈ ప్లాన్‌లు,  వీటితో లభించే ప్రయోజనాల గురించి వివరంగా చూద్దాం...
 

రిలయన్స్ జియో  రూ.219 ప్లాన్ 14 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు ఇంటర్నెట్‌ని ఉపయోగించుకోవడానికి ప్రతిరోజూ 3GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో కంపెనీ రూ. 25 అదనపు డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే అర్హత కలిగిన యూజర్లకు ఆన్ లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తుంది. జియో ఈ ప్లాన్‌కు సబ్ స్క్రిప్షన్ పొందడం ద్వారా మీరు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందుతారు.
 

Latest Videos


మీరు ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఉచిత sms పొందుతారు. ఈ ప్లాన్‌ ద్వారా  జియో సినిమా, జియో టీవీకి కంపెనీ ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

 Airtel  రూ.239 ప్లాన్ 24 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో ఇంటర్నెట్ వినియోగం కోసం కంపెనీ రోజుకు 1 GB డేటాను అందిస్తుంది.
 

మీరు Airtel 5G నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతంలో నివసిస్తే  మీరు ఈ ప్లాన్‌తో అదనపు ఛార్జీ లేకుండా ఆన్ లిమిటెడ్ 5G డేటాను కూడా పొందుతారు. ప్రతిరోజూ 100 ఫ్రీ  SMSలను అందించే ఈ ప్లాన్‌ ద్వారా  మీరు ఆన్ లిమిటెడ్ లోకల్ ఇంకా  STD కాల్స్ కూడా చేయవచ్చు. Airtel  ఈ ప్లాన్ యూజర్లకు Wynk Music  ఫ్రీ షబ్ స్క్రిప్షన్ కూడా  అందిస్తుంది.
 

click me!