ఎయిర్‌టెల్ vs జియో
ఎయిర్‌టెల్ లేదా జియో చూస్తే రూ.299 ప్లాన్‌తో ఏ నెట్వర్క్ ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుందో చూద్దాం... రిలయన్స్ జియో రూ.299 ప్లాన్ వాలిడిటీ పీరియడ్ 28 రోజులు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 2GB డేటా ప్రకారం మొత్తం 56GB డేటాను పొందుతారు. డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత, నెట్ స్పీడ్ 64Kbpsకి తగ్గించబడుతుంది. ఈ ప్యాక్‌తో వినియోగదారులు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు.
ఎయిర్‌టెల్ vs జియో ప్లాన్
ఈ ప్లాన్ కూడా 100 ఉచిత SMSలను అందిస్తుంది. ఈ Jio ప్లాన్‌తో కస్టమర్‌లు JioTV, JioCinema, JioSecurity ఇంకా JioCloudకి ఫ్రీ షబ్ స్క్రిప్షన్ పొందుతారు. ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు రూ. 299 రీఛార్జ్ చేసుకుంటే 7 GB అదనపు డేటాను పొందవచ్చు. అంటే రూ.299తో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 63 జీబీ డేటా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్‌తో మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకుంటే మీరు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఆన్ లిమిటెడ్ లోకల్ అండ్ STD కాల్స్ చేసుకోవచ్చు. దీని వాలిడిటీ 28 రోజులు. అలాగే, మీరు రోజుకు 1.5GB 4G డేటాను పొందుతారు. అంటే మీకు నెల మొత్తం 42GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు రోజుకు 100 ఉచిత SMSలను పొందుతారు.
రిలయన్స్ జియో రూ.299 ప్లాన్‌తో మొత్తం 63GB డేటాను అందిస్తోంది. అయితే, ఇందులో 56GB డేటా అందుబాటులో ఉంటుంది, అయితే Jio 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున కంపెనీ 7GB అదనపు డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్‌తో 42జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్‌తో పోలిస్తే Jio 21GB ఎక్కువ డేటాను అందిస్తోంది.