Iphone 18: ఐఫోన్ 18 కొనాలని అనుకుంటున్నారా? ఈ దేశం లో కొంటే తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది..!

Published : Sep 10, 2026, 05:23 PM IST

Iphone 18: యాపిల్ లాంచ్ చేసిన కొత్త ఐఫోన్ సిరీస్ 18 కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మన దేశంలో కాకుండా.. ఏ దేశాల్లో ఈ ఫోన్ కొంటే.. తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా?

PREV
14
ఐఫోన్ 18 ఎక్కడ కొంటే బెటర్?

యాపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్ ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అలా మార్కెట్లో కి కొత్త సిరీస్ రాగానే.. ఐఫోన్ ప్రియులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా, యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 18 సిరీస్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేశారు. ఈసారి ప్రో మోడల్స్ తో పాటు... యాపిల్ చరిత్రలోనే తొలిసారిగా.. Iphoe Duo పేరుతో ఫ్లిప్, ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చి గట్టి షాకే ఇచ్చింది. కెమెరా ఫీచర్లు, డిజైన్ తో ఈ ఫోన్లు ఎంతలా ఆకట్టుకుంటున్నాయో.. వాటి ధరలు కూడా అంతే స్థాయిలో షాక్ ఇస్తున్నాయి. మన దేశంలో ఐఫోన్ కొనడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే.. ట్యాక్స్, ఇంపోర్ట్ ట్యాక్స్ పేరుతో ఐఫోన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో ధరలు ఎలా ఉన్నాయి..? ఏ దేశంలో ఈ ఫోన్ కొంటే.. మనుక తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు చూద్దాం....

24
మన దేశంలో ధరలు...

iPhone 18 Pro (256GB): ₹1,64,900

iPhone 18 Pro Max (256GB): ₹1,79,900

iPhone Duo (Foldable): ₹2,99,900

అయితే, మనదేశంతో పోలిస్తే విదేశాల్లో ఈ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీరు లేదా మీ స్నేహితులు, బంధువులు విదేశాల నుండి వస్తున్నట్లయితే అక్కడ కొనుగోలు చేయడం వల్ల వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

34
ఇతర దేశాల్లో ధరలు ఎలా ఉన్నాయి?

అమెరికా (US) లో ఐఫోన్ 18 ప్రో ధర ఇండియన్ కరెన్సీలో సుమారు ₹1,14,000 మాత్రమే కాగా, దుబాయ్ (UAE) లో ₹1,32,075, జపాన్‌లో ₹1,37,000గా ఉంది. అంటే, మీరు ఈ ఫోన్‌ను అమెరికాలో కొనుగోలు చేస్తే భారత ధరతో పోలిస్తే ఏకంగా ₹50,900 వరకు ఆదా అవుతుంది.

ఇక Pro Max మోడల్‌పై US లో సుమారు ₹55,900 మిగులుతుండగా, ఖరీదైన iPhone Duoపై అమెరికాలో కొంటే ఏకంగా ₹1,09,900 కంటే ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. మొత్తంమీద, భారత్‌తో పోలిస్తే అమెరికా, దుబాయ్, జపాన్ దేశాల్లో కొత్త ఐఫోన్లు అత్యంత చౌకగా లభిస్తున్నాయి.

44
ఎక్కడ కొంటే అత్యంత చౌక?

అన్ని దేశాలతో పోలిస్తే అమెరికా (US) లో ఐఫోన్ మోడల్స్ అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నాయి. మన దేశంతో పోలిస్తే అమెరికాలో iPhone 18 Proపై దాదాపు ₹50,000 పైనే, ఫోల్డబుల్ మోడల్ iPhone Duoపై ఏకంగా ₹1,09,000 కంటే ఎక్కువ ఆదా అవుతుంది. అమెరికా తర్వాత దుబాయ్ (UAE), జపాన్‌లలో కూడా ఇండియా కంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories