Make Money With AI : ఈ కాలంలో హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తేనే ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు. కాబట్టి ఉద్యోగాలు చేసేవారు, చదువుకునే యువత AI ని సమాచార సేకరణకే కాదు డబ్బు సంపాదనకు ఉపయోగించవచ్చు.
Make Money With AI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కొత్త ఆదాయమర్గాలు తెరుచుకున్నాయి. కాబట్టి 2026 లో ఏఐని కేవలం ఆధునిక టెక్నాలజీగానే కాకుండా సంపాదనకు మార్గంగా మార్చుకొండి. విద్యార్థులు, ఉద్యోగులే కాదు సాధారణ ప్రజలు కూడా పెట్టుబడి లేకుండా AIతో డబ్బు సంపాదించవచ్చు. అలాంటి 5 సులభమైన, నమ్మకమైన మార్గాలగురించి ఇక్కడ తెలుసుకోండి.
26
1. కంటెంట్ క్రియేట్ చేయండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. అంటే మనకు కావాల్సిన సమాచారమేదో సూచించి... వెబ్ సైట్ లేదా వీడియోకు అనుకూలంగా కంటెంట్ తయారుచేసి ఇవ్వమంటే ఏఐ చాట్ బాట్స్ ఇచ్చేస్తాయి. దానికి సొంతమాటలు, హ్యూమన్ టచ్ జోడిస్తే అద్భుతమైన కంటెంట్ క్రియేట్ అవుతుంది. అయితే ఏఐ సమాచారాన్ని కాపీ-పేస్ట్ చేయడంవల్ల కంటెంట్ క్వాలిటీగా ఉండదు... అనుభవాన్ని జోడించాల్సిందే. ఇది మీడియా, సినిమా రంగాల్లో ఉన్నవారికి ఉపయోగపడుంది.
36
2. కెమెరా ముందుకు రాకుండానే వీడియోలు చేయండి
చాలామంది అద్భుతంగా మాట్లాడగలరు... సమాచారాన్ని బాగా వివరించగలరు... కానీ కెమెరా ముందు భయంతో తడబడుతుంటారు. అలాంటివారు ఏఐని ఉపయోగించి ఫేస్ లెస్ వీడియోలను రూపొందించుకోవచ్చు. ఇలాంటి వీడియోలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటివాటిలో పోస్ట్ చేసి ఫాలోవర్స్ నే కాదు డబ్బులు కూడా సంపాదించవచ్చు.
అవసరమైనవారికి AI ని ఉపయోగించిన రెజ్యూమ్ తయారుచేసి ఇవ్వవచ్చు... ఇది కూడా మంచి ఆదాయమార్గమే. కంపెనీల ఆటోమేటెడ్ సిస్టమ్స్‌కు తగ్గట్టు రెజ్యూమెలను మెరుగుపరచొచ్చు.. అయితే ఇందుకోసం కాస్త అనుభవం, రీసెర్చ్ అవసరం. ఏ కంపెనీ ఎలాంటి క్వాలిటీస్ కలిగిన అభ్యర్థుల కోసం వెతుకుతుందో తెలుసుకోవాలి... అందుకు తగ్గట్లుగా ఏఐకి కమాండ్స్ ఇస్తూ రెజ్యూమ్ తయారుచేసి ఇస్తుంది.
56
4. వ్యాపార ప్రకటనలు
చిన్నచిన్న వ్యాపారాలకు సోషల్ మీడియా కంటెంట్ అవసరం ఎక్కువ. కాబట్టి వీరికి AI సాయంతో క్యాప్షన్లు, రీల్స్ ఐడియాలు తయారు చేయొచ్చు. స్థానిక భాష, ట్రెండ్స్ అర్థం చేసుకుని పోస్ట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కొందరు ఇప్పటికే ఇలాంటి ఏఐ ప్రకటన వీడియోలతో వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు.
66
5. బ్లాగ్స్, వెబ్ సైట్స్ నడపండి
ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బ్లాగ్ లేదా వెబ్‌సైట్ నడపడం ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందొచ్చు. AIతో రీసెర్చ్ చేసి, సొంత అనుభవంతో ఆర్టికల్స్ రాయడం, వీడియోలు చేయడం చేయాలి. ఆరోగ్యం, విద్య లాంటి అంశాలకు డిమాండ్ ఎక్కువ... వీటిపై కాస్త అవగాహన ఉన్నా ఏఐ సాయంతో పూర్తి సమాచారం పొందవచ్చు. దీన్ని వివిధ మార్గాల ద్వారా ప్రజలకు అందించి ఆదాయాన్ని పొందవచ్చు.