iphone: ఫోన్‌లలో ఉండే కెమెరాతో ఎవరైనా ఏం చేస్తారు.? అదేం ప్రశ్న ఫొటోలు తీస్తారంటారా.? అయితే ఐఫోన్ కెమెరా కేవలం ఫొటోలు తీయడానికి మాత్రమే కాకుండా మరికొన్ని పనులకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా.?
చాలామంది ఐఫోన్ కెమెరా అంటే మంచి ఫోటోలు, వీడియోల కోసమే అనుకుంటారు. కానీ నిజానికి ఈ కెమెరా రోజువారీ జీవితంలో చాలా ఉపయోగపడే పనులు కూడా చేస్తుంది. యాపిల్ ప్రతి ఏడాది కెమెరా ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ వస్తోంది. అందుకే ఇప్పుడు ఐఫోన్ కెమెరా ఒక మల్టీ-టూల్‌లా మారింది.
25
కెమెరాతో వస్తువుల పొడవు కొలవచ్చు
ఐఫోన్‌లో ముందే ఇచ్చే Measure App సహాయంతో ఏ వస్తువు పొడవు, వెడల్పు కొలవచ్చు. గోడ, టేబుల్, డోర్ వంటి వాటిని కొలవాలంటే టేప్ అవసరం లేదు. యాప్ ఓపెన్ చేసి కెమెరాను వస్తువు వైపు పెట్టాలి. స్క్రీన్‌పై కనిపించే ప్లస్ గుర్తును ట్యాప్ చేస్తే కొలత వెంటనే చూపిస్తుంది. ఇది ఆగ్మెం
35
బోర్డు, పుస్తకం నుంచి టెక్స్ట్ కాపీ చేయొచ్చు
రోడ్డుపై ఉన్న బోర్డు, పుస్తక పేజీ, డాక్యుమెంట్‌లో ఉన్న టెక్స్ట్‌ను టైప్ చేయాల్సిన అవసరం లేదు. కెమెరాను టెక్స్ట్ వైపు పెట్టగానే స్క్రీన్‌లో చిన్న టెక్స్ట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే ఆ టెక్స్ట్‌ను కాపీ చేసుకునే అవకాశం వస్తుంది. ఫోన్ నంబర్ సేవ్ చేయడం, నోట్స్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది.
ఐఫోన్ కెమెరా ఒక స్కానర్‌లా కూడా పనిచేస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంట్‌ను పీడీఎఫ్ ఫైల్‌గా మార్చుకోవచ్చు. Files App ఓపెన్ చేసి మూడు డాట్స్ మెనూ ఎంచుకోవాలి. అక్కడ Scan Document ఆప్షన్ ఉంటుంది. కెమెరాతో డాక్యుమెంట్ ఫోటో తీస్తే అది పీడీఎఫ్‌గా సేవ్ అవుతుంది. ఆఫీస్ పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
55
చేతిరాతను డిజిటల్ నోట్స్‌గా మార్చుకోవచ్చు
నోట్‌బుక్‌లో రాసిన విషయాలను కూడా ఐఫోన్ కెమెరాతో స్కాన్ చేసి టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. తర్వాత వాటిని మెసేజ్‌గా పంపొచ్చు, నోట్స్ యాప్‌లో సేవ్ చేసుకోవచ్చు. చదువు, ఉద్యోగ అవసరాలకు ఇది చాలా హెల్ప్ అవుతుంది.