పోకో X6:
పోకో X6 Snapdragon 7s Gen 2 మొబైల్ గొప్ప పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 2.4GHz క్లాక్ స్పీడ్‌తో 4nm ప్రాసెస్‌లో నిర్మించబడింది. 16GB RAM, LPDDR4X+UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. డాల్బీ విజన్‌తో స్క్రీన్ 68 బిలియన్ కంటే ఎక్కువ కలర్స్ కు సపోర్ట్ చేస్తుంది.
1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 94% స్క్రీన్-టు-బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. డిస్ప్లే 1920Hz PWM డిమ్మింగ్, 2160Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంది. POCO X6 5Gలో 64-మెగాపిక్సెల్ OIS ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 2x ఇన్-సెన్సర్ జూమ్, 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
దీనిని 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చేలా తయారుచేయబడింది. 5,100mAh బ్యాటరీ, డస్ట్ & స్ప్లాష్ కోసం IP54 ప్రొటెక్షన్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మాస్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ ఉన్నాయి.