మీరు ఒకే ఫోన్‌లో 2 సిమ్ కార్డులు వాడుతున్నారా.. ఇక బాదుడే.. TRAI పెనాల్టీ ఎంత..? ఎందుకు?

First Published | Jun 18, 2024, 11:59 AM IST

మీరు మీ ఫోన్‌లో 2 సిమ్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారా లేదా సెకండ్ సిమ్‌ను ఇన్‌యాక్టివ్‌గా ఉంచితే అలంటి సిమ్ కార్డ్‌కు మీరు చార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ చార్జెస్  ఒకేసారి లేదా  ఏడాది ప్రాతిపదికన ఉండవచ్చు. అయితే మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్‌లైన్ నంబర్‌ల కోసం మొబైల్ ఆపరేటర్‌లకు ఛార్జీ విధించాలని TRAI యోచిస్తోంది.
 

 మొబైల్ ఆపరేటర్లు వినియోగదారుల నుండి ఈ చార్జెస్  వసూలు చేయవచ్చు. అయితే నిబంధనల ప్రకారం, ఏదైనా సిమ్ కార్డ్ ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకుంటే బ్లాక్ లిస్టులో పెట్టే నిబంధన ఉంది. చాలా మంది మొబైల్ యూజర్లు  స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్ కార్డ్‌లను ఉపయోగిస్తుంటారు.
 

వీటిలో, ఒకటి యాక్టివ్ మోడ్‌లో ఉంటుంది, మరొకటి చాలా తక్కువ ఉపయోగంలో ఉంటుంది లేదా రీఛార్జ్ లేకుండా  నిరుపయోగంగా ఉంటుంది. అలాగే, కొంతమంది ఒకటి కంటే ఎక్కువ మొబైల్ సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారు. మొబైల్ నంబర్‌కు ఛార్జ్ చేయడానికి ఒక స్కిం రూపొందించబడింది. ప్రస్తుతం 219.14 మిలియన్లకు పైగా మొబైల్ నంబర్లు బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాయి.
 

Latest Videos


చాలా కాలంగా అవి ఇన్ యాక్టీవ్ లో ఉన్నాయి. ఇవి మొత్తం మొబైల్ నంబర్లలో 19 శాతం, ఇది పెద్ద సమస్య. మొబైల్ నంబర్ లొకేషన్ పై  ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. మొబైల్ ఆపరేటర్లకు మొబైల్ నంబర్ సిరీస్‌లను ప్రభుత్వం అందజేస్తుంది. మొబైల్ నంబర్లు పరిమిత పరిమాణంలో అందుబాటులో ఉంటాయని ట్రాయ్ తెలిపింది.
 

ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, ఇంగ్లండ్, లిథువేనియా, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ వంటి దేశాల్లోని టెలికాం కంపెనీలు మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేస్తాయి.

ఇది కాకుండా ప్రీమియం మొబైల్ నంబర్లను రూ.50 వేల వరకు వేలం వేయవచ్చు. ఇది ఆటోమోటివ్ పరిశ్రమలో కార్ నంబర్ ప్లేట్‌ల వేలం లాంటిదే. టెలికాం కంపెనీలు కస్టమర్‌కు 100 నుండి  300 నంబర్‌ల మధ్య సెలెట్  చేసుకునే అవకాశాన్ని ఇవ్వవచ్చు.
 

click me!