Best Smart Watch : 10 రోజుల బ్యాటరీ లైఫ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్.. ఈ వాచ్ చాలా స్మార్ట్ గురూ..!

Published : Nov 17, 2026, 11:44 AM IST

చైనాలో జరిగిన ఈవెంట్‌లో ఒప్పో రెనో 17 సిరీస్‌తో పాటు కొత్త ఒప్పో వాచ్ 5 (Oppo Watch 5) లాంచ్ అయింది. 351mAh బ్యాటరీతో 10 రోజుల పాటు పనిచేసే ఈ స్మార్ట్‌వాచ్‌లో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

PREV
14
ఒప్పో వాచ్ 5 లాంచ్

చైనాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఒప్పో రెనో 17 సిరీస్ (Oppo Reno 17 Series), ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6 (Oppo Pad Air 6), ఒప్పో ఎంకో క్లిప్ 2 (Oppo Enco Clip 2) డివైజ్‌లతో పాటు కొత్త ఒప్పో వాచ్ 5 (Oppo Watch 5) స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

1.85 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చిన ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, పీరియడ్ ట్రాకింగ్ లాంటి ఎన్నో హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, ఇన్‌బిల్ట్ శాటిలైట్ పొజిషనింగ్‌తో పాటు నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం 5ATM, IP69, IP69K రేటింగ్స్‌తో వస్తోంది.

24
ఒప్పో వాచ్ 5 ధర ఎంత?

స్టారీ బ్లాక్ (Starry Black), ఫెయిరీ టేల్ గ్రీన్ (Fairy Tale Green), మూన్‌లైట్ వైట్ (Moonlight White), విష్ ఆరెంజ్ (Wish Orange) కలర్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఒప్పో వాచ్ 5 ధర 899 చైనీస్ యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ.12,700). ఇందులో ఎన్‌చాంటెడ్ పర్పుల్ (Enchanted Purple) కలర్ వేరియంట్ ధర కాస్త ఎక్కువగా 999 చైనీస్ యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ. 14,000) గా ఉంది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ చైనాలో నవంబర్ 20 నుంచి సేల్‌కు రానుంది. ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో త్వరలోనే ప్రకటించనున్నారు.

34
ఒప్పో వాచ్ 5 స్పెసిఫికేషన్స్

ఒప్పో వాచ్ 5లో 390×450 పిక్సెల్ రిజల్యూషన్, 322ppi పిక్సెల్ డెన్సిటీ, స్పోర్ట్స్ మోడ్‌లో గరిష్ఠంగా 3,000 నిట్స్ (3,000 nits) బ్రైట్‌నెస్‌తో 1.85 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. దీనికి రక్షణగా GG5 గ్లాస్ ప్రొటెక్షన్ (GG5 Glass Protection) ఉంది. ColorOS Watch 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ వాచ్.. ఆండ్రాయిడ్ 10 (Android 10), iOS 16, ఆపై వెర్షన్లకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2 (Bluetooth 5.2), NFC పేమెంట్, యాక్సెస్ కార్డ్ సపోర్ట్, ఒప్పోకు చెందిన షియాబు అసిస్టెంట్ (Xiaobu Assistant) ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

కంటిన్యూయస్ హార్ట్ రేట్ & బ్లడ్ ఆక్సిజన్ (SpO2) మానిటరింగ్, ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ అలర్ట్, మణికట్టు ఉష్ణోగ్రత (Wrist Temperature) ట్రాకింగ్, పీరియడ్ సైకిల్ మేనేజ్‌మెంట్ లాంటి హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే రోజంతా స్లీప్ ప్యాటర్న్స్‌ను ట్రాక్ చేసి స్లీప్ క్వాలిటీ రిపోర్ట్‌ను, స్లీప్ ఆప్నియా రిస్క్ (Apnoea Risk Assessments) అంచనాలను అందిస్తుంది.

రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్ లాంటి 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా బాడీ ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడే స్పెషల్ ‘సూపర్ ఫ్యాట్ బర్నింగ్ మోడ్’ (Super Fat Burning Mode) ఇందులో ఉంది. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్‌ను ఇది ఆటోమెటిక్‌గా గుర్తిస్తుంది; అలాగే ఫిట్‌నెస్ లెవెల్, రికవరీ టైమ్ గురించి పూర్తి విశ్లేషణను ఇస్తుంది.

44
బ్యాటరీ, డిజైన్

ఒప్పో వాచ్ 5లో 351mAh బ్యాటరీ, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ (Magnetic Charging) సదుపాయం ఉంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ మోడ్‌లో (Long Battery Life Mode) 10 రోజుల వరకు, స్టాండర్డ్ మోడ్‌లో (Standard Mode) 7 రోజుల వరకు, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AOD) ఆన్ చేస్తే 3 రోజుల వరకు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే BeiDou, GPS, Galileo, GLONASS, QZSS శాటిలైట్ సిస్టమ్స్‌ను సపోర్ట్ చేసే సింగిల్-ఫ్రీక్వెన్సీ L1 శాటిలైట్ పొజిషనింగ్ కూడా ఇందులో ఉంది.

అల్యూమినియం అల్లాయ్ కేస్, స్క్వేర్ డయల్‌తో (Square Dial) డిజైన్ చేసిన ఈ వాచ్ కొలతలు 42×37.27×9.2 మి.మీ. స్ట్రాప్ లేకుండా సుమారు 25 గ్రాముల బరువు, స్ట్రాప్‌తో కలర్‌ను బట్టి 42 గ్రాముల నుంచి 46 గ్రాముల వరకు బరువు ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories