ఈ టైమెక్స్ స్మార్ట్‌వాచ్‌లో ఏడు స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. దీని బ్యాటరీ లైఫ్ కూడా ఏడు రోజుల బ్యాకప్ ఉంటుందని పేర్కొన్నారు. టైమెక్స్ ఫిట్ 2.0 డయల్ గుండ్రంగా ఉంటుంది. దీనిని మూడు రంగులలో కొనుగోలు చేయవచ్చు.
టైమెక్స్ ఫిట్ 2.0 ధర
టైమెక్స్ ఫిట్ 2.0 ధర రూ .5,995. దీనిని టైమెక్స్ అధికారిక వెబ్‌సైట్ నుండి బ్లాక్, బ్లూ అండ్ వైట్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇతర ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ వాచ్ లభ్యతకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
టైమెక్స్ ఫిట్ 2.0 స్పెసిఫికేషన్లు
ఈ టైమెక్స్ వాచ్‌తో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ కోసం ఎస్‌పి 02 సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ప్రేజర్ వంటి సెన్సార్లు ఉంటాయి. టైమెక్స్ ఫిట్ 2.0 కి 45 ఎంఎం డయల్, నావిగేషన్ కోసం సింగిల్ బటన్ లభిస్తుంది. డిస్‌ప్లే సైజ్ గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు.
టైమెక్స్ ఫిట్ 2.0 బ్యాటరీ ఏడు రోజుల బ్యాకప్ ఉంటుందని పేర్కొన్నారు. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఇచ్చారు. దీంతో పాటు మీరు కాల్స్, మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు. ఫోన్‌లో ఫోటోలను కూడా క్లిక్ చేయవచ్చు. దీనికి వాటర్ అండ్ డస్ట్ రిసిస్టంట్ కోసం ఐపి54 రేటింగ్ పొందింది.