కొత్త స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా.. అయితే ఈ 5 ముఖ్యమైన సెన్సార్లు ఎలా పని చేస్తాయో తెలుసా..?

First Published | Aug 25, 2021, 5:23 PM IST

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్క్రీన్ లైట్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. మీరు ఫోన్‌ను ల్యాండ్‌స్కేప్ నుండి పోర్ట్రెయిట్‌కు లేదా పోర్ట్రెయిట్ నుండి ల్యాండ్‌స్కేప్ మోడ్‌కి ఆటో రొటేషన్ ఆన్ చేయడం ద్వారా రొటేట్ చేసినప్పుడు స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో కూడా మారుతుంది. 

ఈవన్ని ఎలా జరుగుతాయో  మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?  ఏదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తిలో ఏదైనా  ఆటోమేటిక్ గా జరిగితే అది సెన్సార్‌ వల్ల జరిగిందని అర్ధం. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు కొత్త కొత్త సెన్సార్‌లతో  వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో  ఉండే కొన్ని ముఖ్యమైన సెన్సార్ల గురించి మీకు తెలుసా..?

ప్రాక్సీమిటి సెన్సార్- ఒక వస్తువు స్మార్ట్‌ఫోన్ దగ్గర ఉన్నప్పుడు, ఈ సెన్సార్ దాని ఉనికిని గుర్తిస్తుంది. ఈ సెన్సార్ ప్రధానంగా ముందు కెమెరా దగ్గర స్మార్ట్‌ఫోన్ పైభాగంలో ఉంటుంది. సాధారణంగా, మీరు కాల్ చేయడానికి లేదా కాల్ మాట్లాడడానికి మీ చెవి దగ్గరికి స్మార్ట్‌ఫోన్‌ను పెట్టుకున్నప్పుడు ఈ సెన్సార్ ఆటోమేటిక్‌గా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలో లైట్ ఆపివేస్తుంది.

Latest Videos


యాక్సిలెరోమీటర్ అండ్ గైరోస్కోప్ సెన్సార్- ఈ సెన్సార్ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ తిరిగే దిశ గురించి చెబుతుంది. మీరు స్మార్ట్‌ఫోన్‌లో వీడియోను చూసినప్పుడల్లా పోర్ట్రెయిట్ మోడ్‌కు బదులుగా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో వీడియోను చూడడానికి ఇష్టపడతారు, తద్వారా వీడియోను పూర్తి స్క్రీన్‌లో చూడవచ్చు. దీని కోసం మనం స్మార్ట్‌ఫోన్‌ని ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో తిప్పిన వెంటనే, ఫోన్‌లో వీడియో ప్లే చేసే ధోరణి కూడా ల్యాండ్‌స్కేప్ అవుతుంది. దీనిని యాక్సిలెరోమీటర్ అండ్ గైరోస్కోప్ సెన్సార్ అని పిలుస్తారు ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లో రొటేషన్ కోసం ఈ రెండు సెన్సార్లు అవసరం, దీనిలో యాక్సిలెరోమీటర్ లీనియర్ యాక్సిలరేషన్   నియంత్రిస్తుంది. గైరోస్కోప్ దాని రొటేషనల్ యాంగిల్ వేగాన్ని నియంత్రిస్తుంది.

బయోమెట్రిక్ సెన్సార్- ఈ  రోజుల్లో దాదాపు అన్ని రకాల మిడ్ రేంజ్ అండ్ హై రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో బయోమెట్రిక్ సెన్సార్ ఉపయోగిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో స్మార్ట్‌ఫోన్‌ను రక్షించడానికి ఈ సెన్సార్ పనిచేస్తుంది. ఈ సెన్సార్ స్మార్ట్‌ఫోన్‌లో రిజిస్టర్ చేసిన బొటనవేలు లేదా వేలిని స్కాన్ చేయడం ద్వారా డేటాను సేకరిస్తుంది. రెండవసారి అదే బొటనవేలు లేదా వేలు ఈ సెన్సార్ దగ్గర పెట్టినప్పుడు  సరైన బొటనవేల కాదా లేదా వేలిని గుర్తించడానికి సేకరించిన డాటాతో  సమాచారాన్ని  కలుపుతుంది.

యాంబియంట్ లైట్ సెన్సార్ - ఈ సెన్సార్ లైట్ కి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే  బ్రైట్ నెస్ అడ్జస్ట్ చేయడమే కాకుండా, డిస్‌ప్లే  బ్రైట్ నెస్ ఆటోమేటిక్ గా పెంచడానికి లేదా తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రోజుల్లో అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఆటో బ్రైట్‌నెస్ కంట్రోల్‌తో వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటికీ కోసం అంబియంట్ లైట్ సెన్సార్ ఉంటుంది
 

జి‌పి‌ఎస్ సెన్సార్-  మీరు ఈ సెన్సార్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దీనిని సాధారణంగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. జి‌పి‌ఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జి‌పి‌ఎస్ అనేది అమెరికా నావిగేషన్ సిస్టమ్. భారతదేశంలో నావిక్ నావిగేషన్ సిస్టమ్ ఉంది కానీ దీనిని చాలా తక్కువ ఫోన్‌లలో ఉపయోగిస్తున్నారు. ఈ సెన్సార్ ద్వారా మీ డివైజ్ లొకేషన్ తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో చెప్పడానికి ఈ సెన్సార్ అన్నీ రకాల శాటిలైట్లతో కనెక్ట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు మాత్రమే జి‌పి‌ఎస్ సెన్సార్ పనిచేస్తుంది అంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేస్తే ఈ సెన్సార్ పనిచేయదు. 
 

click me!