కొత్త బ్రాండింగ్ కంపెనీ నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్ మిక్స్ 4తో ప్రారంభమవుతుంది. ఈ కొత్త ఫోన్‌ని షియోమి మిక్స్ 4 అని పిలుస్తారు. ఈ మార్పు స్మార్ట్‌ఫోన్ కోసమా లేక ఎంఐ బ్రాండ్ అండ్ స్పీకర్ వంటి ఇతర ఎంఐ ఉత్పత్తుల కోసం మాత్రమేనా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎంఐ బ్రాండింగ్ 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.
ఇటీవల విడుదల చేసిన మిక్స్ 4తో ఈ కొత్త మార్పు కనిపించింది. ఇంతకు ముందు దీని పేరు ఎంఐ మిక్స్ 4. ఈ సిరీస్‌లోని ఇతర ఫోన్‌లు ఎంఐ మిక్స్ 3, ఎంఐ మిక్స్ 2 పేరుతో లాంచ్ చేసారు. ఎక్స్‌డిఏ డెవలపర్‌ల ప్రకారం కంపెనీ నుండి రాబోయే ట్యాబ్‌లకు ఎంఐ ప్యాడ్ 5, ఎంఐ ప్యాడ్ 5 ప్రో అని పేరు పెట్టిన్నప్పటికీ, కంపెనీ నుండి ఇకపై రాబోయే ఏవైనా ఉత్పత్తులపై ఎంఐ బ్రాండింగ్ ఉండదు.
ఎంఐ బ్రాండ్ కింద కంపెనీ షియోమీ ఎంఐ 1ని ఆగస్టు 2011లో ప్రారంభించింది. అప్పటి నుండి ఎంఐ టివి బ్రాండ్ కింద స్మార్ట్ టీవీలు, టాబ్లెట్‌లు, స్మార్ట్ డివైజెస్, టయ్స్ ఇంకా ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. ఆగస్టు 26న షియోమి భారతదేశంలో స్మార్టర్ లివింగ్ 2020 ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఇందులో ఎంఐ టివి 5 ఎక్స్, ఎంఐ బ్యాండ్ 6, ఎంఐ నోట్‌బుక్ వంటి ఉత్పత్తులు ప్రారంభించనుంది.
జూన్ 2021లో షియోమి ప్రపంచంలోనే నంబర్ -1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిందని ఇటీవల రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక తెలిపింది. గత మే నెలతో పోలిస్తే దీని అమ్మకాలు 26 శాతం పెరిగాయి. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కంపెనీ వాటా 17.1 శాతానికి పెరిగింది.