ఆపిల్ వాచ్ 'లైఫ్ సేవింగ్' ఫీచర్ ఇప్పుడు శామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్‌లో కూడా.. దాని గురించి తెలుసుకోండి

First Published | Oct 23, 2021, 4:06 PM IST

 అమెరికన్ టెక్నాలజి దిగ్గజం ఆపిల్ (apple)స్మార్ట్ వాచ్‌లో ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది, దీని గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అదేంటంటే ఈ  ఫీచర్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్. ఫాల్ డిటెక్షన్ ఫీచర్ సహాయంతో ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఇప్పుడు ఈ ఫీచర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్  స్యామ్సంగ్ (samsung)గెలాక్సీ వాచ్ 4, స్యామ్సంగ్ గెలాక్సీ వాచ్  4 క్లాసిక్ లకు కూడా వచ్చింది.

ఆపిల్ తర్వాత స్మార్ట్‌వాచ్‌లో ఫాల్ డిటెక్షన్(fall detection) ఫీచర్‌  ఉన్న ప్రపంచంలో రెండవ స్మార్ట్‌వాచ్ కంపెనీగా స్యామ్సంగ్ నిలిచింది. శామ్‌సంగ్ ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లలో ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌ను అప్‌డేట్ ద్వారా ఇచ్చింది.

ఫాల్ డిటెక్షన్ కాకుండా కొత్త అప్‌డేట్‌తో స్యామ్సంగ్ గెలాక్సీ 4, స్యామ్సంగ్ గెలాక్సీ 4 క్లాసిక్ వినియోగదారులు నాలుగు కొత్త వాచ్ ఫేస్‌లను కూడా అందుకుంటారు. వాచ్ ఫెసెస్ తో జీఫీలు కూడా సపోర్ట్ చేస్తాయి. ఇది కాకుండా వాచ్ ఫేస్ కలెక్షన్ కి కొత్త యానిమేషన్లు కూడా జోడించింది. 
 

శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ ఈ సంవత్సరం ఆగస్టులో జరిగిన గెలాక్సీ ఆన్ ప్యాకేడ్ ఈవెంట్‌లో లాంచ్ చేశారు. ఆ తర్వాత ఈ రెండు వాచ్‌లు  మొదటిసారి  ఈ అప్‌డేట్‌ను అందుకున్నాయి. గెలాక్సీ వేరబుల్ యాప్ ద్వారా కొత్త అప్‌డేట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

కొత్త అప్‌డేట్‌తో శామ్‌సంగ్ 'ఇన్ఫో బ్రిక్' (info brick)వాచ్ ఫేస్‌ను కూడా అందించింది, దీనితో హార్ట్ బీట్ రేటు, వాతావరణ అప్ డేట్ తో పాటు డైలీ  స్టేటస్ చూపుతుంది. వినియోగదారులు బేసిక్ డ్యాష్‌బోర్డ్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వినియోగదారులు వాచ్ ఫెసెస్ కూడా ఒక ఫేస్  కస్టమైజ్ చేసి దానికి బ్యాటరీ, మెసేజ్, స్టెప్ కౌంటర్ మొదలైనవి యాడ్ చేయవచ్చు.
 

Latest Videos


కొత్త అప్‌డేట్‌తో గెలాక్సీ వాచ్  గెశ్చర్  కంట్రోల్ కూడా పొందింది, దీని సహాయంతో వినియోగదారులు వర్కౌట్‌ల లిస్ట్, రిమైండర్ క్రియేట్,  లైట్‌లను ఆన్ చేయడం, ఇప్పటికే సెలెక్ట్ చేసిన యాప్‌లను ఓపెన్ చయడం వంటి పనులను చేయవచ్చు. ఇది కాకుండా అరచేతిని రెండుసార్లు పైకి లేపడం, కిందకి అనడం ద్వారా కూడా కాల్స్ స్వీకరించవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4, శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్  ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఆపిల్ వాచ్ లాగానే పని చేస్తుంది. అత్యవసర పరిస్థితిలో యూజర్ కింద పడిపోయిన ఈ వాచ్‌లు ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేస్తాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఈ వాచ్ ముందుగా సెలెక్ట్ చేసిన నాలుగు ఫోన్ నంబర్‌లకు ఎమర్జెన్సీ నోటిఫికేషన్‌లను కూడా పంపుతుంది

click me!