షాకింగ్: చైనీస్ హ్యాకర్ ఫీట్.. ఒక్క సెకనులో ఆపిల్ ఐఫోన్ 13 హ్యాక్..

First Published Oct 23, 2021, 11:42 AM IST

ఆపిల్ ఉత్పత్తులు గోప్యత, భద్రతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, అయితే ఐఫోన్ లేదా ఇతర ఆపిల్ ఉత్పతులు (apple products)హ్యాక్ చేయబడితే పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 13()phone 13) సిరీస్‌ను ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఐఫోన్ 13 ప్రో కూడా ఐఫోన్ 13 సిరీస్‌లో ఒక మోడల్. 

ఒక చైనా హ్యాకర్ (china hacker)ఐఫోన్ 13 ప్రోని ఒక్క సెకనులో హ్యాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐఫోన్ 13ప్రొని ఐ‌ఓ‌ఎస్ 15తో విక్రయిస్తున్నారు. ఈ ఐ‌ఓ‌ఎస్ లో హ్యాకర్  లోపాన్ని గుర్తించి ఉపయోగించుకోవడం ద్వారా ఐఫోన్ 13 ప్రొని హ్యాక్ చేశాడు.

ప్రతి సంవత్సరం చైనాలో చెంగ్డు కప్ పోటీ(Chengdu Cup competition)ని నిర్వహిస్తారు, ఇందులో ప్రపంచం నలుమూలల నుండి హ్యాకర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ఈ పోటీ సమయంలో వైట్ హ్యాట్ హ్యాకర్స్ (pangoo lab) నుండి హ్యాకర్ ఐఫోన్ 13 ప్రోని సెకన్లలో హ్యాక్ చేశాడు. ఇందుకు హ్యాకర్ ఐఫోన్ 13 ప్రోలో ఎస్‌ఎం‌ఎస్ ద్వారా ఒక లింక్‌ను పంపాడు, దానిపై క్లిక్ చేయడం ద్వారా ఐఫోన్ హ్యాక్ జరిగింది. అంతేకాదు హ్యాకర్లు ఫోన్  మొత్తం డేటాను కూడా డిలెట్ చేసేందుకు అక్సెస్ లభించింది.

ఐఫోన్ హ్యాకింగ్ తర్వాత ఫోటో గ్యాలరీతో సహా అన్ని యాప్‌లకు హ్యాకర్ యాక్సెస్ పొందాడు. ఆపిల్ తరచుగా ఐఫోన్ గురించి పెద్ద సెక్యూరిటీ క్లెయిమ్‌లు చేస్తుంది, అయితే ఒక హ్యాకర్ దానిని సెకనులో బయటపెట్టాడు. ఈ హ్యాకింగ్‌లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హ్యాకింగ్ ప్రక్రియ మొత్తం బ్యాక్ గ్రౌండ్ లో జరిగింది. అంటే ఫోన్ హ్యాక్ జరుగుతున్న విషయం ఫోన్ యజమానికి కూడా తెలియదు.

నివేదిక ప్రకారం ఐఫోన్  సఫారి  బ్రౌజర్, ఐ‌ఓ‌ఎస్ కెర్నల్‌లో లోపం ఉంది, ఈ లోపాన్ని ఉపయోగించుకొని ఐఫోన్ హ్యాక్ చేయబడింది, అయితే ఈ లోపాన్ని అధిగమించడానికి కొన్ని రోజుల క్రితం ఐఫోన్ ఐ‌ఓ‌ఎస్ 15  కొత్త అప్ డేట్ విడుదల చేసింది. అయితే హ్యాక్ చేసిన ఫోన్‌లో  కొత్త ఐ‌ఓ‌ఎస్ 15  కొత్త అప్ డేట్ ఇన్ స్టాల్ చేయలేదు. చట్టపరంగా చూసినట్లయితే ఈ హ్యాకింగ్‌కు ఫోన్ యజమాని బాధ్యత వహిస్తాడు, ఎందుకంటే ఆపిల్ ఇప్పటికే హ్యాకింగ్‌కు సంబంధించిన సెక్యూరిటి  అప్‌డేట్‌ను విడుదల చేసింది.
 

ఐఫోన్  13 ప్రొ 128 జి‌బి వేరియంట్ ధర రూ. 1,19,900, 256జి‌బి వేరియంట్ ధర రూ. 1,29,900, 512 జి‌బి వేరియంట్ ధర రూ. 1,49,900, 1టి‌బి స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,69,900. అప్పీల్ ఐఫోన్  13 సిరీస్‌తో 64జి‌బి స్టోరేజ్ తొలగించి 1 టి‌బి స్టోరేజ్ ను కొత్త ట్రెండ్‌గా మార్చింది.

click me!