మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఈ సీక్రెట్ ఫీచర్స్ గురించి తెలుసా.. ఇప్పుడు చాలా ఈజీగా..

First Published Oct 18, 2021, 2:17 PM IST

 ఈ‌ రోజుల్లో  ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌ అనేది సాధారణం. ఇంట్లో ఎంతమంది ఉన్న  వారికి విడివిడిగా స్వంత మొబైల్ ఫోన్  ఉండేందుకు కోరుకుంటారు. అయితే  మీ స్వంత స్మార్ట్‌ఫోన్ గురించి ఏం తెలుసు అని అడిగితే ఏం చెప్తారు..? మీ ఫోన్‌లో ఉండే మీకు తెలియని ఫీచర్లు ఏమిటి అని అడిగితే మీ సమాధానం ఏంటి.. ? అయితే ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉండే సెక్రెట్స్ గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు.

ప్రజలు స్మార్ట్‌ఫోన్‌(smartphoner)ను చూడడానికి కొత్తగా కనిపించేలా చూస్తారు, కానీ దాని ఫీచర్‌లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని కొన్ని సులభమైన 'సీక్రెట్' ఫీచర్ల గురించి  తెలుసుకోండి..

బ్యాటరీ గురించి

మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు చాలా ఉంటాయి. కానీ యాప్స్  వల్ల మీ ఫోన్ బ్యాటరీని ఎక్కువగా వినియోగిస్తాయి, కానీ వాటి గురించి మీకు తెలియదు. కాబట్టి బెస్ట్ మార్గం ఏంటంటే మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి బ్యాటరీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఏ యాప్ ఎంత బ్యాటరీని వినియోగిస్తుందనే పూర్తి సమాచారం ఇక్కడ మీకు లభిస్తుంది. దీంతో ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తున్న యాప్ ని మ్యానేజ్ చేసుకోండీ. దీంతో మీ బ్యాటరి లైఫ్ మెరుగుపడుతుంది.

రెండు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు
మీ ఫోన్‌లో  కుడి లేదా ఎడమ చేతి ఫింగర్ ప్రింట్ సెట్ చేయడం చాలాసార్లు జరుగుతుంది, కానీ ఎడమ చేతితో ఏదైనా పనిచేస్తున్నాప్పుడు ఫోన్ లాక్ ఎలా తెరవాలి... ఇలాంటి  సమస్యను నివారించడానికి సులభమైన మార్గం మీ ఫోన్‌కు రెండు చేతి ఫింగర్ ప్రింట్ జోడించడం. దీని కోసం సెట్టింగ్‌లకు వెళ్లి 'పాస్‌వర్డ్ & సెక్యూరిటీ' పై క్లిక్ చేసి కొత్త ఫింగర్ ప్రింట్ జోడిస్తే సరిపోతుంది.
 

ఫోటోలు, వీడియోల డిలెట్ గురించి 
నేటి కాలంలో చాలా మంది  వారి మొబైల్‌లోనే ఫోటోలు, వీడియోలతో సహా ముఖ్యమైన ఫైల్‌లను  ఉంచుకుంటారు, కానీ ఒకవేళ మీ ఫోన్ పోతే ఏం జరుగుతుందో ఊహించండి..? మీ ముఖ్యమైన ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లు  తిరిగి రాబట్టేందుకు మీ ఫోన్‌లో ఆటో బ్యాకప్ ఆన్‌లో ఉంచండి. దీని కోసం సెట్టింగ్‌లకు వెళ్లి Gmail IDని ఎంచుకుని ఇప్పుడు బ్యాకప్ ఆప్షన్ పై నొక్కండి. దీంతో మీ మొత్తం డేటా  బ్యాకప్ అవుతుంది ఇంకా  మీ డాటాకు సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. 

click me!