కరోనా కాలంలో ఈ మెడికల్ గాడ్జెట్లు మీ ఇంట్లో ఉంచడం చాలా ముఖ్యం.. అవేంటో తెలుసుకోండి..

First Published | Apr 24, 2021, 4:01 PM IST

భారతదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. రోజువారి కేసులతో మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో  ఖచ్చితంగా మీ ఇంట్లో  ఈ వైద్య పరికరాలు ఉండటం చాలా ముఖ్యం.

కరోనా కారణంగా ప్రజలలో జ్వరంతో పాటు కొందరికి ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. ఈ తరుణంలో ఆక్సిమీటర్లు, థర్మామీటర్లకు డిమాండ్ కూడా పెరిగింది. ఎలాంటి సమయంలో అయిన 24 గంటల పాటు మీ ఇంట్లో ఉండాల్సినా కొన్ని చాలా ముఖ్యమైన వైద్య పరికరాల గురించి తెలుసుకోండి...
undefined
ఈ‌సి‌జి మానిటర్ఇంతకుముందు మీరు ఈ‌సి‌జి కోసం ఆసుపత్రి లేదా టెస్ట్ సెంటర్ కి వెళ్ళవలసి వచ్చింది, కానీ ఇప్పుడు మీరు పోర్టబుల్ ఈ‌సి‌జి మానిటర్ ద్వారా ఇంట్లో ఈ‌సి‌జి రిపోర్ట్ పొందవచ్చు. ఆపిల్ వంటి కొన్ని స్మార్ట్‌వాచ్‌లు కూడా ఇసిజికి సపోర్ట్ చేస్తున్నాయి.
undefined

Latest Videos


బ్లడ్ ప్రేజర్ మానిటర్మీ ఇంట్లో ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ బ్లడ్ ప్రేజర్ మానిటర్ ఉంటే చాలా మంచి విషయం. ఒకవేళ లేకపోతే మీరు దానిని ఎవరైనా వైద్యుడిని సంప్రదించి మంచి ఎలక్ట్రానిక్ బ్లడ్ ప్రేజర్ మానిటర్‌ను కొనుగోలు చేయవచ్చు.
undefined
ఆక్సిమీటర్ఆక్సిమీటర్ సహాయంతో మీరు మీ రక్తంలో ఉన్న ఆక్సిజన్‌ లెవెల్ తెలుసుకోవచ్చు. కరోనా ఇన్ఫెక్షన్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ మొదటిసారిగా కొందరిలో పడిపోతున్నాయి ఇది ప్రజలకు సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ మొదట ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది.
undefined
గ్లూకోమీటర్గ్లూకోమీటర్ ద్వారా మీరు మీ రక్తంలో ఉన్న గ్లూకోజ్ మొత్తం గురించి సమాచారాన్ని పొందవచ్చు. మీరు డాక్టర్ సలహా మేరకు గ్లూకోమీటర్ కొనవచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వృద్ధులకు ఉపయోగపడే మెడికల్ అలర్ట్ వ్యవస్థను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది బటన్ తో లాకెట్ లేదా కీ రింగ్ లాంటిది. అత్యవసర పరిస్థితుల్లో ఈ బటన్‌ను నొక్కడం ద్వారా మీ ఇంటిలోని వారికి వినిపించేలా అలారం మొగిస్తుంది.
undefined
click me!