ఎస్‌బిఐ కొత్త ఫిసిలిటీ: ఇప్పుడు మొబైల్ లోనే సేవింగ్స్ అక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు.. ఎలా అంటే ?

First Published Apr 24, 2021, 12:32 PM IST

 ప్రముఖ దేశీయ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)  మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో ద్వారా సేవింగ్స్ ఖాతాను తెరవడానికి వీడియో కెవైసి ఆధారిత సదుపాయాన్ని కల్పించినట్లు శుక్రవారం తెలిపింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుందని, ఇది పూర్తిగా కాంటాక్ట్‌లెస్ ఇంకా పేపర్‌లెస్ అని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
undefined
బ్యాంక్ ఛైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ "ఇది కస్టమర్ భద్రత, ఆర్థిక భద్రత, తక్కువ ఖర్చుతో ఉండేలా చేసే దశ". ఈ చొరవ మొబైల్ బ్యాంకింగ్‌కు కొత్త కోణాన్ని ఇస్తుందని ఇంకా వారి బ్యాంకింగ్ అవసరాలకు డిజిటల్‌గా ఉండటానికి వినియోగదారులకు అధికారం ఇస్తుందని మేము నమ్ముతున్నాము అని అన్నారు.
undefined
ఎస్‌బి‌ఐ బ్యాంకులో కొత్తగా సేవింగ్స్ ఖాతా తెరవాలని యోచిస్తున్న వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవటానికి ముందుగా యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆపై 'న్యూ టు ఎస్‌బిఐ' పై క్లిక్ చేసి తరువాత 'ఇన్‌స్టా ప్లస్ సేవింగ్ అకౌంట్' ఎంచుకోండి.
undefined
మొదట వినియోగదారులు వారి ఆధార్ వివరాలను యాప్ లో ఎంటర్ చేయాలి. ఆధార్ అతేంటికేషన్ పూర్తయిన తర్వాత వారి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి చివరగా కేవై‌సి ప్రక్రియను పూర్తి చేయడానికి వీడియో కాల్ షెడ్యూల్ చేయాలి. వీడియో కే‌వై‌సి విజయవంతం అయిన తర్వాత మీ సేవింగ్స్ అక్కౌంట్ స్వయంచాలకంగా తెరవబడుతుందని బ్యాంక్ తెలిపింది.
undefined
undefined
click me!