ఈ 6 ప్రదేశాలలో సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు.. రాత్రి 2 గంటలైనా సరే..!

First Published | Aug 30, 2023, 8:58 PM IST

సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడని, సాయంత్రం అస్తమిస్తాడని అందరికీ తెలుసు. అయితే కొన్ని రోజుల పాటు సూర్యుడు అస్తమించని ప్రదేశాలు మన భూమిపై ఉన్నాయనంటే నమ్మాల్సిందే. అవును 70 రోజులకి పైగా ఇక్కడ సూర్యాస్తమయం ఉండదు. ఈ ఆరు ఆశ్చర్యకరమైన ప్రదేశాల గురించి  కొన్ని ఆసక్తికరమైన విషయాలు...
 

ఫిన్లాండ్‌లోని చాల ప్రాంతాల్లో వేసవిలో సూర్యుడు అస్తమించడు. దాదాపు 73 రోజుల పాటు ఇక్కడ సూర్యుడు  ప్రకాశిస్తూ ఉంటాడు. చలికాలంలో ఇక్కడ సూర్యుడు లేదా వెలుతురు ఉండదు.
 

ఐరోపాలోని అతిపెద్ద ద్వీపమైన ఐస్‌లాండ్‌లో ఒక నెలపాటు సూర్యుడు అస్తమించడు. జూన్‌లో ఐస్‌లాండ్‌లో సూర్యుడు ఉదయించడు. దీనిని దోమల రహిత దేశంగా కూడా పిలుస్తారు.
 


నార్వేలో దాదాపు 76 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో ఏప్రిల్ 10 నుండి ఆగస్టు 23 వరకు సూర్యాస్తమయం ఉండదు. ఈ సమయంలో చాలా మంది రాత్రి లేని రోజులను చూడటానికి వెళతారు.
 

ఈ ప్రదేశం ఆర్కిటిక్ సర్కిల్‌కు దాదాపు రెండు డిగ్రీల ఎత్తులో ఉంది. వేసవిలో దాదాపు రెండు నెలల పాటు ఇక్కడ సూర్యాస్తమయం ఉండదు. ఇంకా చలికాలంలో ఈ ప్రదేశం వరుసగా 30 రోజులు పూర్తిగా చీకటిలో ఉంటుంది.
 

sweden midnight sun

మే ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు స్వీడన్‌లో అర్ధరాత్రి సూర్యుడు అస్తమిస్తాడు. ఇప్పుడు స్పీడాన్   ఉత్తర నగరమైన కిరునాలో, మే నుండి ఆగస్టు వరకు సుమారు 100 రోజులు సూర్యుడు అస్తమించడు.
 

బరౌ అనేది USలోని ఉత్తర అలాస్కాలోని ఒక చిన్న పట్టణం. ఈ ప్రదేశం  ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరంగా ఉంది, కాబట్టి మే చివరి నుండి జూలై చివరి వరకు ఇక్కడ సూర్యుడు అస్తమించడు. నవంబర్ నెల ప్రారంభం నుంచి 30 రోజుల పాటు ఇక్కడ సూర్యుడు కూడా ఉదయించడు.
 

Latest Videos

click me!