వీడియో గేమ్ పోటీలో విమర్శలు ఎదురుకొన్న ఎలోన్ మస్క్.. బ్రింగ్ బ్యాక్ ట్విట్టర్‌ అంటూ..

First Published | Aug 30, 2023, 8:07 PM IST

బిలియనీర్ వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ  ఎలోన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్ (ప్రస్తుతం X )ని సొంతం చేసుకున్నప్పటి నుండి ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఎలోన్ మస్క్ "ఎ వ్రీథింగ్ యాప్" కోసం అన్వేషణలో ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను రీబ్రాండ్ కూడా చేసాడు, దీనికి సోషల్ మీడియా యూజర్ల  నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. 

కానీ ఒక మీడియా నివేదిక ప్రకారం, వాలరెంట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ (వీడియో గేమ్ పోటీ) ఫైనల్స్‌లో పాల్గొన్నప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్  బహిరంగంగా విమర్శిలు ఎదురుకోవాల్సి వచ్చింది. 

elon musk 1

  'బ్రింగ్ బ్యాక్ ట్విటర్' అంటూ నినాదాలతో జనాలు హోరెత్తించారు. మీడియా నివేదికల ప్రకారం, ఎలోన్ మస్క్ తన కుమారులలో ఒకరితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. లైవ్ గేమ్‌ప్లే సమయంలో దాదాపు నాలుగు సెకన్ల పాటు ఎలోన్ మస్క్ కెమెరాకి   కనిపించారు.
 


 1.5 కోట్ల వ్యూస్ 
Xలో సుమారు 15 మిలియన్  వ్యూస్ ఈ వీడియో సాధించింది. కెమెరా గేమ్‌పై ఫోకస్ చేసినప్పటికీ, ప్రేక్షకులు "బ్రింగ్ బ్యాక్ ట్విట్టర్!" అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్లిప్ X వినియోగదారుల నుండి ప్రతిచర్యలను ప్రేరేపించింది. ఒక యూజర్  మాట్లాడుతూ, వాలరెంట్ ప్లేయర్‌తో అబ్బురపడడం అనేది మిడిల్ స్కూల్‌లో అనిమే క్లబ్‌లో కూరగాయలు తినడం లాంటిదని అన్నారు. మరో యూజర్   హహహ.. మాకు కొత్త లోగో కావాలి అని అన్నారు. 
 

 ట్విట్టర్ కంపెనీని టేకోవర్ చేసిన తర్వాత ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో చాలా మార్పులు చేశారు. దీనిలో Twitter బ్లూ టిక్ అతిపెద్ద మార్పు. అలాగే ఎలోన్  మస్క్ పెయిడ్ వెరిఫికేషన్ విధానాన్ని  కూడా ప్రవేశపెట్టారు.  

Latest Videos

click me!