రియల్‌మీ మొదటి 5జి స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్ సందర్భంగా భారీ తగ్గింపు కూడా..

First Published Feb 12, 2021, 1:24 PM IST

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ  రియల్‌మీ   తాజాగా రియల్‌మీ ఎక్స్‌ 7, రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రోలను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు  కొత్త సంవత్సరంలో భారతదేశంలో లాంచ్ అయిన సంస్థ  మొదటి 5 జీ ఫోన్లు. అంతకుముందు  రియల్‌మీ ఎక్స్ 7, రియల్‌మీ ఎక్స్ 7 ప్రోని గత ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో ప్రారంభించారు. రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రో, రియల్‌మే ఎక్స్‌ 7 ఫోన్‌లకు 5జి సపోర్ట్‌ అందించారు. వీటిలో మొదట రియల్‌మీ ఎక్స్ 7 ప్రో సేల్ జరిగింది, కానీ రియల్‌మీ ఎక్స్ 7  సేల్ భారతదేశంలో ప్రారంభించలేదు. అయితే రియల్‌మీ ఎక్స్‌ 7ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ ఎక్స్ 7 స్పెసిఫికేషన్లురియల్‌మీ ఎక్స్ 7 లో 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి+ డిస్ ప్లే 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లే, డిస్ ప్లే భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇది కాకుండా ఆక్టాకోర్ డైమెన్సిటీ 800 యు ప్రాసెసర్ ఫోన్‌లో అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. దీనికి డిస్ ప్లే యూ‌ఐ ఇంటర్ ఫేస్ ఉంది. ఈ ఫోన్‌కు 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది.
undefined
రియల్‌మీ ఎక్స్ 7కెమెరా గురించి మాట్లాడితే రియల్‌మీ ఈ ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరా సెటప్ ఇచ్చింది. దీని ప్రాధమిక సెన్సార్ కెమెరా 64 మెగాపిక్సెల్స్, దీనితో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2-మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్ కెమెరా ఉంది. 64 మెగాపిక్సెల్ కెమెరాతో 4 కె వీడియోను 30 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేయవచ్చు.
undefined
రియల్‌మీ ఎక్స్ 7 బ్యాటరీఈ ఫోన్‌లో 4310 mAh బ్యాటరీ ఉంది, ఇది 50 వాట్లడార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏ‌ఐ ఆప్టిమైజేషన్ బ్యాటరీతో లభిస్తుంది. ఫోన్ నిబులా, స్పేస్ సిల్వర్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉంటుంది. ఫోన్‌లో డిస్ ప్లే పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బరువు 179 గ్రాములు.
undefined
రియల్‌మీ ఎక్స్ 7 ధరధర గురించి మాట్లాడితే రియల్‌మీ ఎక్స్ 7 5జి వెరీఎంట్ 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ .19,999, 8జిబి ర్యామ్‌తో 128 జిబి వేరియంట్ ధర 21,999 రూపాయలు. మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే లేదా ఫోన్‌ను ఇఎంఐలో కొనుగోలు చేస్తే, మీకు రూ .2,000 తగ్గింపు లభిస్తుంది, యాక్సిస్ బ్యాంక్ కార్డుతో 1,500 రూపాయల తగ్గింపు పొందవచ్చు.
undefined
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటి ఫీచర్స్ గురించి చెప్పాలంటే పంచ్ హోల్ డిస్ ప్లే, సెల్ఫీ కెమెరా సెటప్ రియల్‌మీ ఎక్స్ 7 లో ఇచ్చారు. ఈ రెండు ఫోన్‌లలో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ రెండు ఫోన్‌ల ధర, ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ...
undefined
click me!