ఈ రెండు ఫోన్‌లతో పాటు కంపెనీ రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 10 ఎస్ లను కూడా ప్రవేశపెడుతుందని, ఒకవేళ నిజంగా ఇదే జరిగితే రెడ్‌మి నోట్ సిరీస్ కింద ఒకేసారి నాలుగు ఫోన్‌లను లాంచ్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది అని తెలిపారు.
రెడ్‌మి నోట్ 10 లాంచ్ గురించి షియోమి మైక్రో సైట్ కూడా రూపొందించింది. రెడ్‌మి నోట్ 10 సిరీస్ సేల్ అమెజాన్ ఇండియా నుంచి రాబోతున్నట్లు కూడా ధృవీకరించబడింది. రెడ్‌మి నోట్ 10 సిరీస్ కోసం అమెజాన్ ఇండియాలో ప్రొడక్ట్ పేజీ కూడా ప్రత్యక్షంగా ఉంటుంది.
షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మన్మో కుమార్ జైన్ కూడా ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. రెడ్‌మి నోట్ 10 సిరీస్ సున్నితమైన డిస్ ప్లే ఫోన్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రెడ్‌మి నోట్ 10 సిరీస్‌లో ఇది అధిక రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో ఫోన్ లాంచ్ అవుతుందని తెలిపారు.
షియోమి ఇటీవల రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లైన రెడ్‌మి నోట్ 9 టి, రెడ్‌మి 9టిలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 9టి, రెడ్‌మి నోట్ 9 5జి అప్‌గ్రేడ్ వెర్షన్, అయితే రెడ్‌మి 9టి గత ఏడాది చైనాలో లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 9 4జికి రీ-బ్రాండెడ్ వెర్షన్.
రెడ్‌మి నోట్ 9 4జిని గత నెలలో భారతదేశంలో రెడ్‌మి 9 పవర్ పేరుతో లాంచ్ చేశారు. రెడ్‌మి ఈ రెండు ఫోన్‌లు గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్‌లో మల్టీ షేడ్‌లతో ఉంటుంది. రెడ్‌మి నోట్ 9 టిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రెడ్‌మి 9 టిలో నాలుగు కెమెరాలతో లాంచ్ చేశారు. ఈ రెండు ఫోన్లు భారతదేశంలో లాంచ్ పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.