మీ స్మార్ట్‌ఫోన్ ఎవరైనా దొంగిలించార లేదా పోగొట్టుకున్నారా అయితే వెంటనే ఈ విధంగా చేయండి..

First Published | Feb 12, 2021, 12:13 PM IST

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ ఒకవేళ అదే స్మార్ట్ ఫోన్ పోతే  అది మనకు భయంకరమైన కల లాగా ఉండిపోతుంది.  అలాగే దానిలోని మా వ్యక్తిగత సమాచారం, ఎవరైనా తెలిస్తే మనల్ని పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది. మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే, మీరు ఆన్‌లైన్‌ ద్వారా  మీ స్మార్ట్‌ఫోన్ లోని మొత్తం వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, డాక్యుమెంట్స్ మొదలైనవి సురక్షితంగా తొలగించవచ్చు. అవును నిజమే... అది ఎలాగో తెలుసుకుందాం ...

మీ ఫోన్ పోయే ముందు లేదా దొంగతనానికి గురయ్యే ముందు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మీ ఫోన్ ప్లేస్టోర్ కి వెళ్లి అక్కడ మీ ఫోన్‌లో మై డివైజ్ యాప్ సెర్చ్ చేయండి. యాప్ ఇన్ స్టాల్ చేసాక లాగిన్ చేసి యాప్ ఆక్టివేట్ చేయండి.
undefined
ఒకవేళ మీ ఫోన్ పోయినట్లయితే, మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లో ఇంటర్నెట్‌ను ఓపెన్ చేసి https:myaccount.google.comfind-your-phone లేదా https:www.google.comandroidfind? వెబ్ సైట్ కి వెళ్ళండి అక్కడ మీరు లాగిన్ అవ్వడానికి ఆప్షన్ వస్తుంది.
undefined

Latest Videos


మీరు పాత ఫోన్‌లో ఉపయోగిస్తున్న జి‌-మెయిల్ లాగిన్ ఐ‌డి అంటే దానితో లాగిన్ అవ్వాలి. అలాగే మీరు పోగొట్టుకున్న ఫోన్‌లో ఇంటర్నెట్‌ను ఉండటం అవసరం. లాగిన్ అయిన తర్వాత, మీరు ఈ ఒక కొత్త పేజీ కనిపిస్తుంది, అక్కడ మీరు ఉపయోగిస్తున్న డివైజ్ లిస్ట్ చూస్తారు. దీనిలో మీరు పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన ఫోన్ కూడా చూపిస్తుంది.
undefined
మీ స్మార్ట్ ఫోన్ డివైజ్ పై క్లిక్ చేసిన తర్వాత, మీకు ఒక మ్యాప్‌ చూపిస్తుంది, అందులో దొంగిలించబడిన మీ ఫోన్ ఎక్కడ ఉందో లొకేషన్ చూడవచ్చు. ఎడమ వైపున, మీకు ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్, ఎరేస్ డివైస్ ఆప్షన్స్ ఉంటాయి.
undefined
మొదటి ఆప్షన్ ప్లే సౌండ్ ఎందుకంటే ఫోన్ ఒకవేళ సైలెంట్ మోడ్ లో ఉంటే రింగ్ సౌండ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
undefined
అలాగే సెక్యూర్ డివైజ్ ఆప్షన్ తో మీరు మీ ఫోన్ ని లాక్ చేయవచ్చు అలాగే గూగుల్ నుండి సైన్-అవుట్ చేయవచ్చు.
undefined
మూడవ ఆప్షన్ ఎరేస్ డివైస్, దీని ద్వారా దొంగిలించబడిన మీ ఫోన్‌లో డేటాను తొలగించవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా తరువాత మీకు యూసర్ జి‌-మెయిల్ ఐ‌డి పాస్ వార్డ్ అడుగుతుంది. మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే, దొంగిలించబడిన మీ ఫోన్ మొత్తం డేటా తొలగించబడుతుంది. కానీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
undefined
click me!