Telegram Update: టెలిగ్రామ్‍లో ఇక స్మార్ట్ చాటింగ్, యూజర్లకు అదిరిపోయే అప్ డేట్, కొత్త ఫీచర్లు వచ్చేశాయ్

Published : Jul 23, 2026, 04:18 PM IST

Telegram Update: టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్. రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్, టెంపరరీ బాట్ మెసేజ్‍ వంటి కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. దీంతో చాటింగ్ సులభంగా మారడంతో పాటు గ్రూప్ కమ్యూనికేషన్, కంటెంట్ షేరింగ్ అనుభవం కూడా మెరుగుపడనుంది.

PREV
15
టెలిగ్రామ్ కొత్త అప్‌డేట్

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్. రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్, టెంపరరీ బాట్ మెసేజ్‍ వంటి కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. దీంతో చాటింగ్ సులభంగా మారడంతో పాటు గ్రూప్ కమ్యూనికేషన్, కంటెంట్ షేరింగ్ అనుభవం కూడా మెరుగుపడనుంది. యూజర్ల సంభాషణలను మరింత సులభంగా, ప్రొఫెషనల్‌గా మార్చేందుకు టెలిగ్రామ్ ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

25
వచ్చేసింది రిచ్ టెక్స్ట్ ఎడిటర్

ఈ కొత్త రిచ్ టెక్స్ట్ ఎడిటర్ సాయంతో మెసేజ్‌లలో హెడ్డింగ్స్, లిస్ట్‌లు, టేబుల్స్, కోట్స్, కోడ్ బ్లాక్స్ వంటివి చేర్చవచ్చు. ఈ కొత్త ఎడిటర్‌తో మెసేజ్‌లోనే ఫోటోలు, వీడియోలను చేర్చవచ్చు. దీనివల్ల సంభాషణలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ కొత్త రిచ్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్‌తో ఒకే మెసేజ్‌లో గరిష్ఠంగా 32,768 అక్షరాలను పంపే వీలుంటుంది.

35
ప్రీమియం యూజర్లకు మాత్రమే

ప్రస్తుతం ఈ కొత్త రిచ్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్‌ను టెలిగ్రామ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఒకే అంశానికి సంబంధించిన గ్రూపులు, ఛానెళ్లు, బాట్‌లను ఒకేచోట ఆర్గనైజ్ చేసేందుకు 'కమ్యూనిటీస్' ఫీచర్‌ను పరిచయం చేశారు. గ్రూపులోని బాట్‌లు ఇప్పుడు ఒక వ్యక్తికి మాత్రమే కనిపించేలా తాత్కాలిక మెసేజ్‌లు పంపగలవు. వెల్‌కమ్ మెసేజ్‌లు, ఏఐ సమ్మరీలకు ఇది ఉపయోగపడుతుంది.

45
తాత్కాలిక బాట్ మెసేజ్‌లు

ఈ మెసేజ్‌లను బాట్, మెసేజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే చూడగలరు. ప్రైవేట్ నోటిఫికేషన్ల కోసం ఈ కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. టెలిగ్రామ్ తన జిఫ్ సెర్చ్ ఫీచర్‌ను విస్తరించింది. ఇప్పుడు 36 భాషల్లో 35 కోట్లకు పైగా జిఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌లతో మెసేజ్‌లను మరింత ప్రొఫెషనల్‌గా మార్చుకోవచ్చని, పెద్ద కమ్యూనిటీలను సులభంగా మేనేజ్ చేయవచ్చని టెలిగ్రామ్ తెలిపింది.

55
36 భాషల్లో 35 కోట్లకు పైగా జిఫ్‌లు
టెలిగ్రామ్ కొత్త అప్‌డేట్‌లో రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్, ఎఫెమెరల్ బాట్ మెసేజ్‌లు, మెరుగైన జిఫ్ సెర్చ్ వంటి ఫీచర్లు వచ్చాయి. ఇకపై మెసేజ్‌లలో హెడ్డింగ్స్, టేబుల్స్, కోడ్ బ్లాక్స్‌తో పాటు ఫోటోలు, వీడియోలు కూడా నేరుగా యాడ్ చేయొచ్చు. ఒకే రకమైన గ్రూపులు, ఛానెళ్లను 'కమ్యూనిటీస్' ఫీచర్‌తో సులభంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. 36 భాషల్లో 35 కోట్లకు పైగా జిఫ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి.
Read more Photos on
click me!

Recommended Stories