Smart Wallet: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా స్మార్ట్‌గా మారుతున్నాయి. అలాంటి ఉత్పత్తుల్లో ట్యాగ్8 డాల్ఫిన్ బ్లూటూత్ స్మార్ట్ వాలెట్ ఒకటి. అధునాతన ఫీచర్లున్న ఈ వాలెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కేవలం డబ్బు, కార్డులు పెట్టుకునే సాధారణ పర్స్ మాత్రమే కాదు. పోయిన పర్స్‌ను గుర్తించడంలో సహాయపడే బ్లూటూత్ ట్రాకర్, కార్డులను రక్షించే RFID టెక్నాలజీ, యాంటీ-లాస్ట్ అలర్ట్ వంటి ఆధునిక ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ వాలెట్. ముఖ్యంగా మహిళల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. ఈ స్మార్ట్ వాలెట్‌లో బ్లూటూత్ లో ఎనర్జీ (BLE) ఆధారిత ట్రాకర్‌ను అమర్చారు. దీన్ని Android లేదా iPhoneలో DOLPHIN Tracker యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.
25
వెంటనే అలర్ట్
ఒకవేళ పర్స్ మీ మొబైల్‌కు నిర్ణయించిన దూరం దాటితే వెంటనే ఫోన్‌లో అలర్ట్ వస్తుంది. దీంతో పర్స్‌ను మరిచిపోయి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పర్స్ పూర్తిగా కనిపించకుండా పోయినా యాప్‌లో అది చివరిసారిగా ఎక్కడ ఉందో చూపిస్తుంది. ట్రాకర్ మళ్లీ పరిధిలోకి వచ్చిన వెంటనే దాని స్థానాన్ని గుర్తించేందుకు కూడా ఈ వ్యవస్థ సహాయపడుతుంది.
35
కార్డులకు పూర్తి భద్రత.. డేటా దొంగతనానికి చెక్
ఈ వాలెట్‌లో RFID బ్లాకింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ప్రస్తుతం కొన్ని డిజిటల్ పరికరాల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డుల్లోని సమాచారాన్ని అనుమతి లేకుండా స్కాన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి డేటా చోరీని ఈ టెక్నాలజీ అడ్డుకుంటుంది. దీంతో మీ కార్డుల్లోని వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. డబ్బుతో పాటు డిజిటల్ సమాచారానికి కూడా రక్షణ కల్పించడం ఈ వాలెట్ ప్రత్యేకత.
స్టైలిష్ డిజైన్‌తో పాటు ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యం
ఈ స్మార్ట్ వాలెట్‌ను ప్రీమియం లెదర్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. బయటకు చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, లోపల అవసరమైన అన్ని వస్తువులు సౌకర్యంగా పెట్టుకునేలా విశాలమైన స్థలం కల్పించారు. నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు, నాణేలు, లైసెన్స్, ఐడీ కార్డులు వంటి ముఖ్యమైన వస్తువులను విడివిడిగా భద్రపరచుకునేలా అనేక కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. రోజువారీ వినియోగానికి అనువుగా ఉండటంతో పాటు వస్తువులు సులభంగా అందుబాటులో ఉండేలా దీని డిజైన్‌ను రూపొందించారు.
55
దీర్ఘకాల బ్యాటరీ.. మహిళలకు అద్భుతమైన గిఫ్ట్
ఈ వాలెట్‌లో ఉండే ట్రాకర్‌కు సుమారు మూడు సంవత్సరాల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. సాధారణ వినియోగంలో తరచూ బ్యాటరీ మార్చాల్సిన అవసరం ఉండదు. అలాగే ట్రాకర్ శక్తివంతమైన అలారం ద్వారా పర్స్ దూరమైన వెంటనే హెచ్చరిక ఇస్తుంది. అందువల్ల పర్స్ పోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, భద్రత వంటి అన్ని అంశాలు ఒకే ఉత్పత్తిలో ఉండటంతో ఇది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, దీపావళి, రాఖీ, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.