ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో టెక్నో మొదటి 5జి స్మార్ట్‌ఫోన్‌.. నైజీరియా ఫీచర్స్ ఇవే..

First Published | Dec 28, 2021, 1:39 PM IST

చైనీస్ మొబైల్ ఫోన్  తయారీ సంస్థ టెక్నో (Tecno) మొదటి 5జి స్మార్ట్‌ఫోన్(5g smartphone) టెక్నో పోవా 5జి(Tecno Pova 5G)ని విడుదల చేసింది. టెక్నో పోవా 5జి(tecno pova 5g)ని నైజీరియాలో లాంచ్ చేశారు. టెక్నో పోవా 5జితో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌. 

టెక్నో  ఈ ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చింది. టెక్నో పోవా 5జిలో MediaTek Dimensity 900 ప్రాసెసర్ లభిస్తుంది.

టెక్నో పోవా 5జి ధర 
టెక్నో పోవా 5జి ధర 129,000 నైజీరియన్ నైరా అంటే దాదాపు రూ. 23,500. ఫోన్‌ కారిడార్ ఫోన్ ధర గురించి సమాచారాన్ని అందించింది. అయితే టెక్నో పోవా 5జి ఇంకా కంపెనీ వెబ్‌సైట్‌లో జాబితా కాలేదు.  ఈ ధర వద్ద 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌లభిస్తుంది. దీనిని డీజిల్ బ్లాక్, పోలార్ సిల్వర్, పవర్ బ్లూ రంగులలో విక్రయించనున్నారు. టెక్నో పోవా 4జి భారతదేశంలో ఈ సంవత్సరం నవంబర్‌లో రూ. 9,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది.
 

టెక్నో పోవా 5జి స్పెసిఫికేషన్లు
టెక్నో పోవా 5జిలో అండ్రాయిడ్ 11 ఆధారిత HiOS 8.0 ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఫోన్ 1080x2460 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.95-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే లభిస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. ఈ ఫోన్‌లో MediaTek Dimension 900 ప్రాసెసర్, 8జి‌బి ర్యామ్ మరియు 128 జి‌బి స్టోరేజ్ ఉన్నాయి.


టెక్నో పోవా 5జి కెమెరా 
కెమెరా గురించి మాట్లాడుతూ  టెక్నో పోవా 5జిలో మూడు బ్యాక్ కెమెరాలు ఇచ్చారు, ఇందులో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌, రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్‌పై క్వాడ్ ఎల్‌ఈ‌డి ఫ్లాష్ లైట్ ఇచ్చారు.
 

టెక్నో పోవా 5జి  బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో డి‌టి‌ఎస్ స్పీకర్, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, Wi-Fi 802.11 b/g/n, USB టైప్-C పోర్ట్, ఎఫ్‌ఎం రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Latest Videos

click me!