Tech Tips: మౌస్‌లో ఉన్న మిడిల్ బటన్ కేవలం స్క్రోల్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ నిజానికి వెబ్ బ్రౌజర్‌లో ఈ మిడిల్ బటన్‌తో చాలా పనులు వేగంగా చేసుకోవచ్చు. మౌస్ మిడిల్ బటన్‌తో ఉపయోగపడే 5 ముఖ్యమైన ట్రిక్స్ గురించి తెలుసుకుందాం.
ఏదైనా వెబ్‌సైట్‌లో లింక్‌పై సాధారణంగా లెఫ్ట్ క్లిక్ చేస్తే అదే ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. కానీ మిడిల్ క్లిక్ చేస్తే ఆ లింక్ కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా పని చేస్తున్న ట్యాబ్‌ను వదిలిపెట్టకుండా మరో పేజీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఓపెన్ చేయాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే Shift కీ నొక్కి మిడిల్ క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్ వెంటనే ఓపెన్ అయి ఆ ట్యాబ్‌కే మారుతుంది.
25
ఒకేసారి బుక్‌మార్క్స్ ఓపెన్ చేయొచ్చు
బుక్‌మార్క్స్‌ను కూడా మిడిల్ క్లిక్‌తో త్వరగా ఓపెన్ చేయవచ్చు. ఒక్కో బుక్‌మార్క్‌పై మిడిల్ క్లిక్ చేస్తే అది కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. ఇంకా బుక్‌మార్క్ ఫోల్డర్‌పై మిడిల్ క్లిక్ చేస్తే అందులో ఉన్న అన్ని వెబ్‌సైట్లు ఒకేసారి వేర్వేరు ట్యాబ్స్‌లో ఓపెన్ అవుతాయి. రోజూ ఒకే వెబ్‌సైట్లు ఓపెన్ చేసే వారికి ఇది చాలా టైమ్ సేవ్ చేస్తుంది.
35
బ్రౌజర్ ట్యాబ్‌ను వెంటనే క్లోజ్ చేయొచ్చు
ట్యాబ్‌ను మూసేయడానికి “X” బటన్‌పై క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాబ్‌పై కర్సర్ పెట్టి మిడిల్ క్లిక్ చేస్తే అది వెంటనే క్లోజ్ అవుతుంది. ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేసి పని చేసే వారికి ఇది చాలా వేగంగా ఉపయోగపడే ట్రిక్. పొరపాటున ట్యాబ్ క్లోజ్ అయితే బ్రౌజర్‌లో “Reopen Closed Tab” ఆప్షన్ ద్వారా మళ్లీ తెరవచ్చు.
Previous లేదా Next Pageను కొత్త ట్యాబ్‌లో తెరవొచ్చు
బ్రౌజర్‌లో ఉన్న Back లేదా Forward బటన్‌పై మిడిల్ క్లిక్ చేస్తే ఆ పేజీ కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ట్యాబ్‌ను అలాగే ఉంచి, గతంలో చూసిన పేజీని మరో ట్యాబ్‌లో చూడవచ్చు. ఇది ముఖ్యంగా రీసెర్చ్ లేదా కంపారిజన్ చేసే సమయంలో చాలా ఉపయోగపడుతుంది.
55
ప్రస్తుతం ఉన్న ట్యాబ్‌ను డూప్లికేట్ చేయొచ్చు
బ్రౌజర్‌లో ఉన్న Refresh బటన్‌పై మిడిల్ క్లిక్ చేస్తే ప్రస్తుతం ఉన్న ట్యాబ్‌కు కాపీ తయారవుతుంది. అంటే అదే వెబ్‌పేజ్ మరో ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఫామ్స్ ఫిల్ చేయడం, రెండు అకౌంట్స్‌తో పని చేయడం లేదా ఒకే వెబ్‌సైట్‌ను రెండు చోట్ల ఉపయోగించాలనుకునే సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.