AC Gas : టెక్నీషియన్ అవసరం లేదు.. ఏసీలో గ్యాస్ ఉందో, లేదో మీరే చెక్ చేసుకొండి, చాలా సింపుల్

Published : May 19, 2026, 01:01 PM IST

AC Gas Check : మీ ఏసీ కూలింగ్ తగ్గిందా..? ఇందుకు గ్యాస్ తగ్గడం కారణం కావచ్చు. టెక్నిషియన్ అవసరం లేకుండానే గ్యాస్ తగ్గిందోలేదో సింపుల్ గాా తెలుసుకోవచ్చు. 

PREV
14
ఏసీ గ్యాస్ ఎంతుందో మీరే తెలుసుకొండి...

AC Gas : వేసవిలో వచ్చిందంటే చాలు ఎయిర్ కండీషన్ (AC) కు డిమాండ్ పెరుగుతుంది. మండుటెండలు, ఉక్కపోత నుండి ఉపశమనం కోసం చాలామంది ఏసీలు వాడుతుంటారు. అయితే వర్షాకాలం, చలికాలం ఏసీతో పెద్దగా పని ఉండదు... కాబట్టి నాలుగైదు నెలలు సరిగ్గా వాడకుండా సమ్మర్ లో ఎక్కువగా వాడేసరికి ఏసి చల్లదనం తగ్గుతుంది. టెక్నీషియన్ ను పిలిస్తే సింపుల్ గా కంప్రెసర్ లో గ్యాస్ అయిపోయింది.. రీఫిల్ చేయాలని చెప్పి రూ.3000-4000 వసూలు చేసేస్తారు.

అయితే ఏసిలో గ్యాస్ అయిపోయిందని చెప్పి కొందరు ఏసి మెకానిక్ లు కస్టమర్లను మోసం చేస్తుంటారు. మనకు ఏసిలో గ్యాస్ చాంబర్ ఎక్కడుంటుందో తెలియదు.. అందులో గ్యాస్ ఉందో లేదో తెలియదు... అందుకే మెకానిక్ చెప్పింది నమ్మేస్తుంటాం. కానీ మార్కెట్లో అతి తక్కువ ధరకు లభించే కొన్ని పరికరాలతో ఏసీలో గ్యాస్ ఎంతుందో మనమే తెలుసుకోవచ్చు… ఇలాంటి మోసాల నుండి బైటపడవచ్చు.

24
రిఫ్రిజెరెంట్ మానిఫోల్డ్ గేజ్ సెట్ వాడండి..

సాధారణంగా చల్లదనాన్ని అందించే పరికరాలైన ఏసి, రిఫ్రిజిరేటర్, డీప్ ఫ్రీజర్లలో రిఫ్రిజెరెంట్ గ్యాస్ ఉపయోగిస్తారు. ఇది వేడి గాలిని తొలగించి చల్లదనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏసీలోకి ఈ రసాయన వాయువు నిరంతరం గదిలోని వేడి గాలిని గ్రహించి చల్లని గాలిని బయటకు పంపుతుంది. అందుకే ఈ గ్యాస్ తగ్గితే ఏసి పనితీరు నెమ్మదిస్తుంది... చల్లదనం తగ్గుతుంది.

అయితే ఏసిలో గ్యాస్ ఎంతుంది..? ఏమైనా తగ్గిందా..? రీఫిల్ చేయాల్సిన అవసరం ఉందా..? అన్నది గుర్తించేందుకు రిఫ్రిజెరెంట్ మానిఫోల్డ్ గేజ్ అనే పరికరం ఉపయోగపడుంది. దీని ద్వారా గ్యాస్ పరిమాణాన్ని తెలుసుకోవడమే కాదు లీకేజీలను కూడా కనిపెట్టవచ్చు. ఇలా ఈ పరికరం సాయంతో మెకానిక్ అవసరం లేకుండానే ఏసీలో గ్యాస్ ఉందోలేదో తెలుసుకోవచ్చు... అవసరం అయితేనే మెకానిక్ ను సంప్రదించి రీఫిల్ చేయించవచ్చు. దీనివల్ల గ్యాస్ పేరిట మెకానిక్స్ చేసే మోసాలకు చెక్ పెట్టవచ్చు.

34
రిఫ్రిజెరెంట్ మానిఫోల్డ్ గేజ్ సెట్ ధర..?

ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, డీప్ ఫ్రిజ్ లలో పాటు ఇతర శీతలీకరణ పరికరాల్లోనూ కూలింగ్ కోసం ఈ రిఫ్రిజెరెంట్ గ్యాస్ వాడతారు... కాబట్టి వీటన్నింటిలో గ్యాస్ ఎంతుందో తెలుసుకునేందుకు రిఫ్రిజెరెంట్ మానిఫోల్డ్ గేజ్ సెట్ ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్ లో తక్కువ ధరకే లభిస్తుంది.... కేవలం రూ.1000 నుండి రూ.2000 వరకు ధరకే ఈ సెట్ లభిస్తుంది. అంటే ఒక్కసారి గ్యాస్ రీఫిల్ ధరకంటే తక్కువకే ఇది లభిస్తుంది... దీంతో మెకానిక్స్ మోసాలనుండి బైటపడవచ్చు.

44
ఏసీలో గ్యాస్ లీకులను సరిచేయండి...

సాధారణంగా ఏసీలో రిప్రిజెరెంట్ గ్యాస్ పూర్తిగా అయిపోవడం జరగదు... కాస్త తగ్గవచ్చు. అయితే ఏవైనా లీకేజీలు ఉంటే మాత్రం గ్యాస్ పూర్తిగా అయిపోతుంది. ఒకవేళ మీ ఏసీలో గ్యాస్ పూర్తిగా అయిపోతే అందుకే లీకేజీయే కారణం కావచ్చు... రీఫిల్ సమయంలో మెకానిక్ తో గ్యాస్ ఎక్కడినుండి లీక్ అవుతుందో గుర్తించమనండి. ముఖ్యంగా కంప్రెసర్ నాజిల్ ను తనిఖీ చేయమనండి... అక్కడినుండి ప్రధానంగా గ్యాస్ లీక్ అవుతుంది.

ఇక ఏసీలోని రాగి పైపులు లేదా కాయిల్స్ దెబ్బతినడం, తుప్పుపట్టడం వంటి కారణాలతో కూడి గ్యాస్ లీక్ అవుతుంది. తరచూ సర్వీసింగ్ చేయడంవల్ల ఈ సమస్య ఉండదు. మీ ఏసి సరిగ్గా కూల్ కాకున్నా, ఔట్ డోర్ యూనిట్ లో మంచు గడ్డకట్టడం, ఏసీలోంచి వింతైన వాసన వస్తే గ్యాస్ లీక్ అవుతున్నట్లే. ఈ సమయంలో రిఫ్రిజెరెంట్ మానిఫోల్డ్ గేజ్ సెట్ తో మీరే చెక్ చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories