మరో అయిదేళ్లలో మీరు వాడే ఈ వస్తువులు కనుమరుగు.. అవేంటో చూడండి

Published : Oct 23, 2025, 11:30 AM IST

Tech News: టెక్నాల‌జీ రోజురోజుకీ పెరిగిపోతోంది. మ‌రీ ముఖ్యంగా ఏఐ రాక‌తో అంతా మారిపోయింది. మ‌రి మ‌రో 5 ఏళ్ల‌లో ఎలాంటి మార్పులు రానున్నాయి.? అస‌లేం జ‌ర‌గ‌నుంది.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
ఇక‌పై పాస్‌వ‌ర్డ్‌లు ఉండ‌వు

ఇప్పుడు మనం వాడే పాస్‌వర్డ్‌లు త్వరలో కాల గ‌ర్భంలో క‌లిసిపోనున్నాయి. మోబైల్, ల్యాప్‌టాప్‌లు, ఆన్‌లైన్ అకౌంట్స్ అన్నీ.. బయోమెట్రిక్ సిస్టమ్‌ల ద్వారా సెక్యూర్ కానున్నాయి. ఇప్ప‌టికే బ‌యోమెట్రిక్ విధానం అందుబాటులో ఉన్నా రానున్న రోజుల్లో ఇది మ‌రింత వేగ‌వంతం కానుంది. చేతి వేళ్లు, కంటి చూపు పాస్‌వ‌ర్డ్‌గా మార‌నున్నాయి.

26
డెబిట్ కార్డులు ఉండ‌వా.?

డిజిట‌ల్ ఎకాన‌మీ కార‌ణంగా ప్ర‌స్తుతం మార్కెట్లో క‌రెన్సీ త‌గ్గిపోయింది. ఎక్క‌డ చూసినా డెబిట్, క్రెడిట్ కార్డులే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అయితే 2030 నాటికి వీటి వినియోగం కూడా భారీగా త‌గ్గిపోనుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. డిజిటల్ వాలెట్లు, QR కోడ్‌లు ఆర్థిక లావాదేవీలకు ప్రధాన మార్గంగా మారతాయి. అలాగే పేప‌ర్ రిసిప్ట్స్ కూడా పూర్తిగా క‌నుమ‌రుగుకానున్నాయి.

36
తాళం చెవిలు మాయం కానున్నాయి

ఇప్పుడు మనం వాడే సంప్రదాయ కీలు అతి త్వరలో అవసరం లేకుండా పోతాయి. స్మార్ట్ లాక్స్, ఫోన్లు లేదా బయోమెట్రిక్ గుర్తింపుతో, ఇంటికి, కారుకు, ఆఫీసు డోర్ల‌ను తెర‌డం మ‌రింత సులభంగా మారుతుంది.

46
కెబుల్స్, హార్డ్ డ్రైవ్‌లు, డేటా భద్రతా మార్పు

కెబుల్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు వేగంగా తగ్గిపోతాయి. క్లౌడ్ స్టోరేజ్ వేగవంతమైన, సురక్షితమైన డేటా భద్రతను అందిస్తోంది. అందువల్ల ఫైళ్లు ఎక్కడినుంచైనా, ఏ సమయంలోనైనా సులభంగా యాక్సెస్ చేయ‌వ‌చ్చు.

56
టెలివిజన్ ఛానల్స్, గ్యాస్ వాహనాల తగ్గుదల

సాంప్రదాయ టెలివిజన్ ఛానల్స్ ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి. OTT ప్లాట్ఫారమ్‌లు, స్ట్రీమింగ్ సర్వీసులు ప్రధాన వినోద మార్గంగా మారతాయి. అదే విధంగా, గ్యాస్ వాహనాలు తగ్గి విద్యుత్ వాహనాలు దానిని భర్తీ చేస్తాయి.

66
మ‌నిషి జీవితంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంది.

ఈ టెక్నాల‌జీ మన రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తాయి. మనం కేవలం పనులను వేగంగా చేయడం మాత్రమే కాదు, సమయం, డేటా వంటి వాటితో జీవనం మరింత సులభతరం అవుతుంది. 2030 నాటికి ఈ మార్పులు చాలా స‌హ‌జ‌మైన మార్పుగా అనిపిస్తాయ‌ని నిపుణులు అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories