గూగుల్ క్రోమ్ కు పోటీగా ఓపెన్ ఏఐ బ్రౌజర్ .. చాట్ జిపిటి పవర్డ్ అట్లాస్ ప్రత్యేకతలేంటో తెలుసా?

Published : Oct 22, 2025, 08:18 AM IST

ChatGPT Browser : ఓపెన్‌ఏఐ సరికొత్తగా చాట్‌జీపీటీతో కూడిన ఏఐ బ్రౌజర్ ను లాంచ్ చేసింది. ఈ ఏఐ పవర్డ్ అట్లాస్ బ్రౌజర్ అనేక ప్రత్యేకతలను కలిగివుంది... ఇది యూజర్లకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని ఓపెన్ ఏఐ చెబుతోంది.

PREV
17
గూగుల్ క్రోమ్ కు ఫోటీగా ఓపెన్ ఏఐ బ్రౌజర్

OpenAI Atlas Browser : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (చాట్ జిపిటి) తో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది ఓపెన్ ఏఐ. ఇప్పుడు మరోసారి టెక్ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్దమయ్యింది ఈ అమెరికన్ కంపెనీ. చాట్ జిపిటి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగానే సరికొత్త బ్రౌజర్ ని తీసుకువచ్చింది... ఏఐ పవర్డ్ బ్రౌజర్ 'అట్లాస్'ను లాంచ్ చేసింది. ఇది గూగుల్ క్రోమ్, పెర్‌ప్లెక్సిటీ (Perplexity)కి చెందిన కామెట్ (Comet)కు నేరుగా పోటీ ఇస్తుంది. ఇప్పటివరకు ఓపెన్‌ఏఐ, చాట్‌జీపీటీలో వేర్వేరు ఏజెంట్ల ద్వారా ఏఐ ఫీచర్లను జోడిస్తుండగా, ఇప్పుడు ఈ ఏజెంటిక్ పవర్ అంతా ఒక కొత్త బ్రౌజర్‌లో లభించబోతోంది. ఈ కొత్త బ్రౌజర్‌లో ప్రత్యేకత ఏంటి, ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం...

27
అట్లాస్ ఏఐ బ్రౌజర్‌లో ప్రత్యేకత ఏంటి?

ఓపెన్‌ఏఐ అట్లాస్‌ను వేగవంతమైన, ఫ్లెక్సిబుల్, ఫ్యూచర్-రెడీ బ్రౌజర్‌గా అభివర్ణించింది. ఇది యూజర్లకు సరికొత్త వెబ్ అనుభవాన్ని అందించడానికి డిజైన్ చేయబడింది. ఈ బ్రౌజర్‌లో చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్ ఉంది. దీనిలో చాట్, మెమరీ, ఏజెంట్ అనే మూడు ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.

37
చాట్ ఫీచర్

అట్లాస్‌ బ్రౌజర్ ఉపయోగించిన యూజర్లు ఏ వెబ్‌సైట్‌తోనైనా చాట్‌జీపీటీని కనెక్ట్ చేయవచ్చు. అంటే మీరు అట్లాస్ బ్రౌజర్ వాడుతున్నప్పుడు ఏ వెబ్‌సైట్‌లో ఉన్నా నేరుగా చాట్‌జీపీటీని ప్రశ్నలు అడగవచ్చు లేదా సహాయం తీసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా చాట్‌జీపీటీని తెరవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తున్నా, ఉత్పత్తులను పోలుస్తున్నా లేదా ఒక రిపోర్ట్ సారాంశం తయారు చేయాలన్నాచాట్‌జీపీటీ సహాయం చేస్తుంది.

47
మెమొరీ ఫీచర్

అట్లాస్ మెమరీ మోడ్ గత సంభాషణలు, బ్రౌజింగ్ హిస్టరీని గుర్తుంచుకుంటుంది. ఉదాహరణకు 'గత వారం నేను చూసిన జాబ్ పోస్టింగ్‌లను వెతికి ఇండస్ట్రీ ట్రెండ్స్ విశ్లేషణను తయారు చెయ్' అని అడిగితే ఈ సమాచారం మొత్తాన్ని ముందుంచుతుంది. అంటే ఇప్పుడు చాట్‌జీపీటీ మీకు ఒకరకంగా డిజిటల్ అసిస్టెంట్‌గా మారుతుంది. మీ హిస్టరీ లేదా డేటా సేవ్ కాకూడదనుకుంటే ఇంకాగ్నిటో మోడ్ (Incognito Mode) ఆప్షన్ కూడా ఉంది. అలాగే యూజర్ ఎప్పుడైనా తమ మెమరీని డిలీట్ లేదా ఆర్కైవ్ చేసుకోవచ్చు.

57
ఏజెంట్ మోడ్ ఫీచర్

అట్లాస్ అత్యంత అధునాతన ఫీచర్ ఏజెంట్ మోడ్ (Agent Mode). ఇది చాట్‌జీపీటీకి మీ తరపున పనిచేసే శక్తిని ఇస్తుంది. ఈ మోడ్‌లో చాట్‌జీపీటీ మీ కోసం సైట్‌లకు వెళ్లి పరిశోధన చేయగలదు, ప్రయాణ ప్రణాళికలు తయారు చేయగలదు, ఈవెంట్లను నిర్వహించగలదు లేదా అపాయింట్‌మెంట్లు బుక్ చేయగలదు. అయితే లైవ్‌స్ట్రీమ్ సమయంలో ఏజెంట్ మోడ్‌లో ప్రైవసీ ఒక పెద్ద సమస్య కావచ్చని ఓపెన్‌ఏఐ బృందం అంగీకరించింది. కానీ చాట్‌జీపీటీ ఏజెంట్ కేవలం బ్రౌజర్ ట్యాబ్‌లకే పరిమితమవుతుందని కంపెనీ భరోసా ఇచ్చింది. ఇది మీ కంప్యూటర్ ఫైల్స్ లేదా కోడ్‌ను యాక్సెస్ చేయలేదు.

67
అట్లాస్‌లో గూగుల్ సెర్చ్ ఉంటుందా?

అట్లాస్‌లో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్ లేదా బింగ్ కాకుండా 'చాట్‌జీపీటీ సెర్చ్' ఉంటుంది. యూజర్‌కు స్మార్ట్, డైరెక్ట్ సెర్చ్ ఫలితాలు అందించడానికి ఓపెన్‌ఏఐ ఇందులో సాంప్రదాయ సెర్చ్ ఇంజిన్ లాంటి అనుభవాన్ని ఇవ్వడానికి అనేక మార్పులు చేసింది.

77
ఓపెన్‌ఏఐ అట్లాస్‌ను ఎలా ఉపయోగించాలి?

ప్రస్తుతానికి అట్లాస్ బ్రౌజర్ Mac యూజర్ల కోసం లాంచ్ చేయబడింది. అలాగే దీని ఏజెంట్ మోడ్ కేవలం చాట్‌జీపీటీ ప్లస్, ప్రో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే దీన్ని విండోస్, మొబైల్ వెర్షన్ల కోసం కూడా లాంచ్ చేస్తామని ఓపెన్‌ఏఐ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories