హూటే యాప్ ఎనిమిది భాషలకు సపోర్ట్ చేస్తుంది, ఇందులో భారతీయ, విదేశీ బాషలు రెండూ ఉన్నాయి. హూటే తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ భారతీయ భాషలుగా సపోర్ట్ చేస్తుంది.
హూటే ఫీచర్లు
హూటే యాప్ లో వినియోగదారులు టైప్ చేయకుండా మాట్లాడటం ద్వారా మెసేజ్ పంపగలిగే విధంగా రూపొందించారు. సింపుల్ గా చెప్పాలంటే హూటే అనేది వాయిస్ నోట్ యాప్. వాయిస్ నోట్ రికార్డ్ చేసిన తర్వాత వినియోగదారులు వారి ప్రాధాన్యతల ప్రకారం మ్యూజిక్, ఫోటోలను జోడించవచ్చు.
ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి హూటే యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను ఉపయోగించే ముందు మీరు రిజిస్టర్ చేసుకోవాలి. యాప్‌లో మీరు రజనీకాంత్, గౌతమ్ గంభీర్, న్యూస్ ఛానెల్‌లు, రాజకీయ నాయకుల వంటి ప్రముఖులను ఫాలో కావొచ్చు. యాప్‌లో ఉన్న వాయిస్ నోట్‌లను సులభంగా ప్లే చేయవచ్చుమ, పాజ్ చేయవచ్చు. ఇందులో లైట్, రీ-పోస్ట్, రీ-షేర్ వంటి ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.
హూటే యాప్ వినియోగదారులు 60 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ని రికార్డ్ చేయవచ్చు. రికార్డింగ్ తర్వాత క్యాప్షన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోలను జోడించవచ్చు. మ్యూజిక్ కోసం ఎమోషన్, ఎన్విరాన్‌మెంటల్, నేచర్, రిలిజియస్, నేటివ్ వంటి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. హూటే యాప్‌లో కామెంట్‌లను ఆఫ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. క్యాప్షన్ కోసం గరిష్టంగా 120 పదాల ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.