పండగకి స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి లేదంటే..?

First Published | Oct 25, 2021, 5:32 PM IST

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ప్రజలకు ఒక అవసరంగా మారింది, కానీ తెలివిగా ఆలోచింది ఫోన్ కొనడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది  ఇతరులు ఏదైనా ఫోన్‌ కొన్నాక  దాని చూసి వారు కూడా అదే ఫోన్ కొనుగోలు చేస్తారు. అది ఖరీదైనదా లేదా చౌకైనదా వారికి ఆ ఫోన్ అవసరం ఉందా లేదా ఇది అస్సలు చూడరు. 

ఈరోజుల్లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తున్నంది, ఏ ఫోన్‌ తీసుకోవాలో ఏది తీసుకోకూడదో తెలియని అయోమయానికి గురవుతున్నారు. కొన్ని ఫోన్‌లు ఒక విధంగా మిగతా వాటి కంటే మెరుగ్గా లేదా ఇంకో విధంగా మెరుగ్గా ఉన్నప్పటికీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు ఏ ఫోన్‌ను ఇష్టపడతారో అది వారి ఆప్షన్. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ కొనడానికి ముందు కొన్ని ఇతర విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా తర్వాత ఎలాంటి సమస్య ఉండదు. వాటి గురించి తెలుసుకుందాం...

ఈరోజుల్లో మెటల్, ప్లాస్టిక్ తో పాటు గ్లాస్ కోటెడ్ ఫోన్లు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి. అందుకే స్మార్ట్ ఫోన్ కొనే సమయంలో కచ్చితంగా దాని బాడీపై శ్రద్ధ పెట్టి ఫోన్ కింద పడితే పగిలిపోయే ప్రమాదం తక్కువగా ఉండే విధంగా కొనుగోలు చేయాలీ. ఈ విషయంలో గ్లాస్ కోటెడ్ ఫోన్‌ల కంటే మెటల్ అండ్ ప్లాస్టిక్ బాడీలతో కూడిన ఫోన్‌లు కొంచెం మెరుగ్గా ఉంటాయి.

Latest Videos


మీరు స్మార్ట్‌ఫోన్‌  కొనుగోలు చేసే ముందు డిస్‌ప్లేపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం. మీరు మొబైల్‌లో వీడియో స్ట్రీమింగ్, సినిమాలు చూడటం కోసం అయితే  5.5 అంగుళాల నుండి 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మీరు సాధారణ ఉపయోగం కోసం కావాలనుకుంటే 5 అంగుళాల నుండి 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్ ప్లే కూడా మంచి  ఆప్షన్. 

స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ కూడా చాలా ముఖ్యం. ఇంకా ఫోన్ కెమెరా కూడా మెరుగ్గా ఉండాలి. కెమెరా అపెర్చర్, ISO లెవెల్, పిక్సెల్ సైజు, ఆటో ఫోకస్ వంటి ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని మీరు ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీరు తీసే ఫోటోలు మెరుగ్గా ఉంటాయి.

ఈ రోజుల్లో 5000mAh స్ట్రాంగ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు గేమ్‌లు ఆడాలనుకుంటే, లైవ్ వీడియోలను చూడడానికి, ఎక్కువ యాప్‌లను ఉపయోగించాలనుకుంటే 4000-5000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్ మీకు ఉత్తమంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే  స్మార్ట్‌ఫోన్ కొనడానికి ముందు ఆపరేటింగ్ సిస్టమ్, స్టోరేజ్‌ను గుర్తుంచుకోండి.

click me!