ఫోన్‌పే యూజర్లకు షాక్.. రూ.50కు మించితే ఛార్జీలు షురూ.. సోషల్ మీడియాలో ఫైర్..

First Published | Oct 25, 2021, 4:24 PM IST

భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రారంభించి ఐదు సంవత్సరాలకు పైగా కావొస్తుంది. నేడు ఊహించిన దాని కంటే ఎక్కువగా యూ‌పి‌ఐ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూ‌పి‌ఐ చెల్లింపులు(upi payments) చేస్తున్నారు. 

కొందరు పేటి‌ఎం నుండి మరికొందరు గూగుల్ పే, ఇంకొందరు ఫోన్ పే నుండి చెల్లిస్తున్నారు. గత వారం వరకు అంతా బాగానే ఉంది, కానీ ఫోన్‌పే (phon pe)నుండి వచ్చిన ఒక ప్రకటన వినియోగదారులను కోపానికి గురిచేస్తుంది. ఫోన్‌పే ఇప్పుడు మొబైల్ రీఛార్జ్(mobile recharge) లపై డబ్బులు చార్జ్ చేస్తున్నట్లు తేలీపింది.  

ఫోన్‌పే ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ లపై ఛార్జ్ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. కంపెనీ స్టేట్‌మెంట్ ప్రకారం, రూ .50 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే రూ.1  ఛార్జ్  చేయనుంది, అయితే మీరు రూ .100 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మీకు రూ.2 ఛార్జ్ చేయబడుతుంది.

Latest Videos


రూ. 50 అంతకంటే తక్కువ రీఛార్జ్‌పై ఎటువంటి ఛార్జీ ఉండదు, అయితే ప్రస్తుతానికి ఇది ఒక ప్రయోగం అని ఫోన్ పే చెప్పినప్పటికీ కూడా ఇది ఇంకా పూర్తిగా అమలు కాలేదు, కానీ ఫోన్ పే రిచార్జ్ పై డబ్బులు చార్జ్ చేయడం పై వినియోగదారులు  అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌పే వినియోగదారులు సోషల్ మీడియా(social media)లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తు ఇది డిజిటల్ ఇండియాన అని ప్రశ్నిస్తున్నారు.. ?

ఫోన్ పేతో రీఛార్జ్ చేయడం ఇప్పటి వరకు ఉచితం. గూగుల్ పే, పేటి‌ఎం, ఫ్రీచార్జ్, అమెజాన్ పే వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికీ ఉచిత రీఛార్జ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఫోన్ పే లో ఫోన్ రీఛార్జ్ మినహా అన్ని రకాల చెల్లింపులు ఇంతకు ముందుల ఉచితం అంటే యూ‌పి‌ఐ చెల్లింపుపై ఎలాంటి ఛార్జీలు విధించదు అని కూడా చెప్పింది.
 

ఈ సంవత్సరం జూలైలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)డేటాను వెల్లడించింది, దీనిలో ఫోన్ మార్కెట్ భారీగా ఉందని తెలిపింది. కేవలం ఫోన్ పేకి మాత్రమే యూ‌పి‌ఐ చెల్లింపులలో 46.04 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఫోన్‌పే ద్వారా 1,292.71 మిలియన్ల లావాదేవీలు జరిగాయి, అంటే రూ.2,62,565.88 కోట్లు. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 1,653.19 మిలియన్లు పెరిగి రూ.3,06,437.37 కోట్లకు చేరుకుంది.

click me!