అద్భుతమైన ఫీచర్లు.. కొత్త స్టైల్‌లో శాంసంగ్ W సిరీస్.. లాంచ్ ఎప్పుడో తెలుసా ? పూర్తి వివరాలు ఇవే!!

First Published | Sep 5, 2023, 2:25 PM IST

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అప్ కమ్మింగ్  స్మార్ట్‌ఫోన్ సిరీస్ W24 లాంచ్  తేదీని చైనాలో ప్రకటించింది. W24 సిరీస్ W23 సిరీస్‌ను అనుసరిస్తుంది.  W24 అండ్ W24 ఫ్లిప్‌ ఫోన్  కూడా ఈ సిరీస్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే W సిరీస్‌ని మాత్రమే విడుదల చేయాలని కంపెనీ నిర్ధారించింది. Weiboలో టీజర్ పోస్టర్ ద్వారా లాంచ్ ఈవెంట్ వివరాలను Samsung షేర్ చేసింది.
 

చైనాలోని చెంగ్డు హై అండ్ న్యూ స్పోర్ట్స్ సెంటర్‌లో సెప్టెంబర్ 15న  లాంచ్ కానుంది. Samsung W24 అండ్  W24 ఫ్లిప్ Galaxy Z Fold 5 ఇంకా  Galaxy Z Flip 5  రీబ్రాండెడ్ వెర్షన్ అని ఊహిస్తున్నారు. దీనిని జూలైలో లాంచ్ చేసారు. అయితే W24, W24 ఫ్లిప్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. 
 

ఈ ఫోన్ లేటెస్ట్  Galaxy Z ఫోల్డ్‌కి రీబ్రాండెడ్ వెర్షన్ అని కూడా చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీ తప్ప దక్షిణ కొరియా కంపెనీ 
శాంసంగ్ ఇతర ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ కొత్త W సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉంటాయో  ఒక ఆలోచన ఉంటుంది, ఎందుకంటే ఇవి Galaxy Z Fold 5, Galaxy Z Flip 5   కస్టమైజెడ్  వెర్షన్‌లని ఊహించవచ్చు.

Latest Videos


Galaxy Z Flip 5కి 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫోల్డబుల్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే  ఉంది, HDR10+ ఇంకా  1080 x 2640 పిక్సెల్‌లకు సపోర్ట్ చేస్తుంది. దానితో పాటు, 3.4-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ద్వారా శక్తిని పొందుతుంది,  25-W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3700mAh బ్యాటరీతో వస్తుంది.
 

కెమెరా ముందు భాగంలో వెనుక భాగంలో డ్యూయల్ 12-మెగాపిక్సెల్ సెటప్ ఇంకా  10-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. మరోవైపు, Galaxy Z Fold 5 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+,  1812 x 2176 పిక్సెల్‌లకు సపోర్ట్ ఇచ్చే 7.6-అంగుళాల ఫోల్డబుల్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను అందిస్తుంది.  
 

స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ద్వారా శక్తిని పొందుతుంది, 25-W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ముందు భాగంలో10-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌  ఉంది. ఫోల్డబుల్ డిస్‌ప్లేలో 4-మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంది. 

వెనుకవైపు, Galaxy Z Fold 5లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. రాబోయే డబ్ల్యూ24, డబ్ల్యూ24 ఫ్లిప్‌ ఈ స్పెసిఫికేషన్‌లు ఉన్నట్లు చెబుతున్నారు.

click me!