ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం సోనీ నుండి ఒక కొత్త ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ తెలుసుకోండి..

First Published Jan 28, 2021, 2:27 PM IST

జపాన్ మల్టీ నేషనల్ కంపెనీ సోనీ తన  ఎక్స్‌పీరియా సిరీస్ కింద కొత్త సోనీ ఎక్స్‌పీరియా ప్రో స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రీ-వ్యూ కోసం ఫోన్ లో డబుల్ మానిటర్ ఇందులో ప్రవేశపెట్టారు. ఇది కాకుండా ఫోన్‌కి  మైక్రో హెచ్‌డిఎంఐ కనెక్టర్  అందించారు. దీని ద్వారా మీరు ఫోన్‌ను కెమెరాకు కనెక్ట్ చేయవచ్చు. అలాగే కెమెరాను ఫోన్‌కు కనెక్ట్ చేసి4కె లైవ్ ఫీడ్‌ను చూడవచ్చు.
 

సోనీ ఎక్స్‌పీరియా ప్రో ధరసోనీ ఎక్స్‌పీరియా ప్రో ధర 2,499.99 డాలర్లు అంటే ఇండియాలో రూ.1,82,500. ఈ ఫోన్‌ను ప్రస్తుతం అమెజాన్, బి అండ్ హెచ్ ఫోటో వీడియో, సోనీ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా యుఎస్‌లో అందుబాటులో ఉంది. ఇతర దేశాలలో ఈ ఫోన్ లభ్యత పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
undefined
సోనీ ఎక్స్‌పీరియా ప్రో ఫీచర్లుసోనీ ఎక్స్‌పీరియా 1 II అలాగే సోనీ ఎక్స్‌పీరియా ప్రో ఫీచర్స్ విషయంలో చాలా తక్కువ తేడాలు ఉన్నాయి, ఈ ఫోన్ ఇప్పటికే సోనీ ఆల్ఫా కెమెరాను కలిగి ఉన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ల కోసం ప్రారంభించారు.సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో ఆండ్రాయిడ్ 10, 6.44-అంగుళాల 4 కె హెచ్‌డిఆర్ డిస్‌ప్లే, 1644x3840 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, ఓ‌ఎల్‌ఈ‌డి ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 12 జిబి ర్యామ్, 512 జిబి యుఎఫ్‌ఎస్ స్టోరేజీ ఉంది, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచవచ్చు.
undefined
సోనీ ఎక్స్‌పీరియా ప్రో కెమెరాకెమెరా గురించి మాట్లాడుతూ, సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ప్రాధమిక లెన్స్ 12-మెగాపిక్సెల్ ఎక్స్‌మోర్ ఆర్‌ఎస్ కెమెరా , రెండు 12 మెగాపిక్సెల్స్ లెన్స్ కెమెరాలు, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది, దీని ఎపర్చరు ఎఫ్ 2.0 ఉంది.
undefined
సోనీ ఎక్స్‌పీరియా ప్రో బ్యాటరీ అండ్ కనెక్టివిటీకనెక్టివిటీ కోసం సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో 5జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జిపిఎస్ ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, మైక్రో హెచ్‌డిఎంఐ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. దీనికి ఎక్స్‌పీరియా అడాప్టివ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 225 గ్రాములు.
undefined
click me!